Site icon NTV Telugu

RGV: నట్టి కుమార్ కు కౌంటర్ అటాక్!

Rgv Natty

Rgv Natty

నిర్మాత నట్టి కుమార్ తో తనకున్న విభేదాలపై రామ్ గోపాల్ వర్మ బుధవారం నాడు స్పందించాడు. అయితే… తనవి ఫోర్జరీ డాక్యుమెంట్స్ అంటూ వర్మ విమర్శించడాన్ని నట్టి కుమార్ ఖండించాడు. వర్మ బాధితులు చిత్రసీమలో ఎంతో మంది ఉన్నారని చెప్పాడు. అయితే నట్టి కుమార్ చేసిన తాజా విమర్శలపై గురువారం ఆర్జీవీ మరోసారి స్పందించాడు. తన జవాబును ప్రెస్ నోట్ రూపంలో మీడియాకు విడుదల చేశాడు. అందులో నట్టి కుమార్ ను సూటిగా ప్రశ్నిస్తూ… శరాలను సంధించాడు వర్మ. అవి ఇవి: ”మీ దగ్గరున్న చెక్స్ కరెక్ట్ అయితే వాటిని క్యాష్ ఎందుకు చేసుకోలేదు? మీ కేసు లో విషయముంటే, హై కోర్ట్ సస్పెండ్ ఎందుకు చేసింది? నా దగ్గర మోసపోయిన ప్రొడ్యూసర్లందరిని చేరుస్తానన్నారు…వాళ్ళెక్కడ? నా గురించి నేనెంత మోసగాడినో మీకు అన్ని ఏళ్లుగా తెలిసుంటే మొన్న మొన్నటివరకు నన్నెందుకంత పొగిడారు? ‘అడివి’ సినిమా నుంచి నిన్న మొన్నటి ‘మర్డర్’ సినిమా వరకూ, నా చుట్టూ తిరిగి ఇప్పుడు సడెన్ గా నా గురించి జ్ఞానోదయం అయ్యిందా? నాకు సినిమాలు తీయటం రాదు ఓకే… మరి మీ కొడుకుతో, మీ కూతురితో సినిమాలు తీసి వాళ్ళ కెరియర్లు ఫినిష్ చేసిన సంగతేంటి? ధనుష్, అడ్డాల చంటి, సురేష్ బాబు, ‘దిల్’ రాజు, సి. కళ్యాణ్, అశోక్ కుమార్, భాను, రామ సత్యనారాయణ, అచ్చం నాయుడు, సునీల్ నారాంగ్, నారాయణ దాస్ నారాంగ్, రాంచరణ్, నిఖిల్, నాని, అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి… ఇంకా ఎన్నో వందలమందితో మీకున్న హిస్టరీ మర్చిపోయారనుకుంటున్నారా? మీకు కానీ మీతో గాని ప్రాబ్లెమ్ లేని వాడు అసలు ఈ భూ ప్రపంచంలో ఉన్నడా? మీరు ప్రెస్ మీట్లు, గ్రూప్స్ లో మెసేజ్లు పెడతానే వుండండి. అవన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాము. వాటి ఫైనల్ రిజల్ట్ మీకు అతి త్వరలో తెలుస్తుంది. థ్యాంక్స్ అండి!” అంటూ వర్మ ఈ ప్రెస్ నోట్ లో పేర్కొన్నాడు. మరి దీనిపై నట్టి కుమార్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Exit mobile version