Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Naresh Talks About Beauty Movie Success Reviews

Naresh: మా సినిమా రివ్యూలు అన్నీ ప్రింట్ తీయిస్తున్నా!

Published Date :September 22, 2025 , 9:43 am
By Mounika
Naresh: మా సినిమా రివ్యూలు అన్నీ ప్రింట్ తీయిస్తున్నా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

అంకిత్ కొయ్య, నీలఖి, వీకే నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా.. జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం నాడు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో..

Also Read : Radhika Sarathkumar : సీనియర్ నటి రాధిక తల్లి గీత కన్నుమూత..

వీకే నరేష్ మాట్లాడుతూ .. ‘‘బ్యూటీ’ మూవీలోని సోల్ మా అందరినీ ప్రమోషన్స్‌లో ఎక్కువ మాట్లాడించేసింది. ఆ సోల్ ఇప్పుడు ఆడియెన్స్‌కి కనెక్ట్ అవుతోంది. దర్శక, నిర్మాతలకు సినిమా రిలీజ్‌కంటే ముందే శాలువా కప్పేశాను. ఎందుకంటే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు ముందే తెలుసు. నా కెరీర్‌లో 350 మూవీలు చేసి ఉంటాను.. ఈ చిత్రానికి వచ్చిన రివ్యూలన్నీ కూడా ప్రింట్ అవుట్ తీసుకుంటున్నాను. ఇలాంటి రివ్యూలు నా జీవితంలో ఇంతవరకు రాలేదు. మా మూవీని ఇంత ఆదరించిన మీడియాకు థాంక్స్. నా కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ ఈ మూవీ నాకు మాత్రం ఎంతో స్పెషల్. ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి కనెక్ట్ అయ్యే చిత్రమిది. అందరి మనసులకు హత్తుకునే మూవీని తీసిన వర్దన్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. సుబ్బు మంచి కథను ఇచ్చారు. సాయి కుమార్ కెమెరా వర్క్ ఎంతో అందంగా అనిపించింది. విజయ్ పాల్ రెడ్డి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఒకే నెలలో సక్సెస్, ఫెయిల్యూర్ చూశాడు. నిండు కుండ తొణకదు అన్నట్టుగా నిర్మాత ఉన్నారు. నీలఖి అద్భుతంగా నటించారు. అంకిత్ కొయ్య ఇండస్ట్రీలో నిలిచిపోతాడు. విజయ్ బుల్గానిన్ మంచి సంగీతాన్ని అందించారు. లవ్, ఎమోషనల్, ఫ్యామిలీ ఇలా అన్ని రకాల అంశాలను జోడించిన ఈ మూవీని ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Beauty film cast and crew
  • Beauty movie hit talk
  • Beauty movie reviews
  • Beauty movie success
  • Beauty Telugu film

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions