Site icon NTV Telugu

Nara Rohit : బాబాయ్.. ఏదేమైనా నీకు తోడుగా ఉంటా.. మనోజ్ పై నారా రోహిత్..

Nara Rohit

Nara Rohit

Nara Rohit : మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న భైరవం మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న ఏలూరులో జరిగింది. ఈవెంట్ లో మంచు మనోజ్ స్పీచ్ హైలెట్ గా నిలిచింది. చాలా ఎమోషనల్ అయిపోయాడు మనోజ్. దీనిపై తాజాగా నారా రోహిత్ స్పందించాడు. ఈవెంట్ విషయాలను ఎక్స్ లో ట్వీట్ చేశాడు. ‘భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అద్భుతంగా జరిగింది. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఏలూరు ప్రజలకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు. ఈవెంట్ కు ఇంత క్రేజ్ తీసుకురావడానికి కారణం మనోజ్ బాబాయ్. చాలా పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చడు. అతని స్పీచ్ నాకు కూడా ఇన్ స్పైర్ గా అనిపించింది. ఏదేమైనా బాబాయ్ నీకు అండగా ఉంటా’ అని రోహిత్ రాసుకొచ్చాడు.

Read Also : Pawan Kalyan : పవన్ సినిమా ఉండగా.. థియేటర్లు బంద్ అవుతాయా..?

ఇందుకు సంబంధించిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మనోజ్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. తన కుటుంబం తనను రోడ్డుపై పడేసినా అభిమానులు అండగా ఉన్నారంటూ చెప్పాడు. అందరూ కలిసి తనను నడిరోడ్డుపై కట్టుబట్టలతో నిలబెట్టారని.. తన పిల్లల బట్టలు కూడా లేకుండా చేశారని ఎమోషనల్ అయ్యాడు. ఏడేళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నానని చెప్పాడు. శివయ్య అంటే శివుడు రాడని.. ఇలాంటి అభిమానులు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ల రూపంలో వస్తాడని చెప్పాడు. మనోజ్ చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు దారి తీశాయి. దీనిపై విష్ణు ఏమైనా మాట్లాడుతాడా లేదా అన్నది వేచి చూడాలి.

Read Also : Tragedy : సంసార సాగరంలో ‘ప్రేమ’ సునామీ..! చివరికి

Exit mobile version