Site icon NTV Telugu

Nandamuri Balakrishna: మామకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపిన నారా లోకేష్

Nbk

Nbk

నందమూరి బాలకృష్ణ నేడు తన 62 వ పుట్టినరోజును గ్రాండ్ గా జరుపుకుంటున్న విషయం విదితమే.. ఇక బాలయ్య పుట్టినరోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది. ఇండస్ట్రీ వర్గాలు మరియు రాజకీయ పార్టీల ప్రముఖులు నుంచి పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తాజాగా బాలయ్య అల్లుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు వారసుడు నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆయనకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపాడు.

“నిజాయితీ, నిరాడంబరత, ముక్కు సూటితనం, కష్టపడే తత్వం, అన్నిటికి మించి గోల్డెన్ హార్ట్ అయినటువంటి నా బాల మావయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని మీ కలలు అన్నీ సాకారం అవ్వాలని కొట్టుకుంటున్నాను” అంటూ బాలయ్య కొత్త చిత్రం NBK 107 పోస్టర్ ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణిని చంద్రబాబు తనయుడు నారా లోకేష్ వివాహం చేసుకున్న సంగతి తెల్సిందే.. వీరికి దేవాన్ష్ అనే కొడుకు ఉన్నాడు. మనవడు అంటే బాలయ్యకు ఎంతో ప్రేమ.. కొంచెం గ్యాప్ దొరికినా మనవడితో ఆడుతూ కనిపిస్తాడు బాలయ్య. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version