న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ వచ్చిన చిత్రం ‘ది ప్యారడైజ్’. విడుదలకు ముందే ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రీమియర్స్ నుండి థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా సినిమాలోని సెకండాఫ్ పై అనేక విమర్శలు వచ్చాయి. అయితే టాక్ తో సంబంధం లేకుండా నైజాంలో మంచి వసూళ్లే రాబడుతోంది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
అయితే వీకెండ్ వరకు బాక్సాఫీస్ వద్ద వేరే పెద్ద సినిమాల పోటీ లేకపోవడం, అలాగే హాలిడే అడ్వాంటేజ్ లు లభించడం, సినిమా చూసేందుకు మరే అప్షన్ లేకపోవడంతో ‘ది ప్యారడైజ్’ మంచి వసూళ్లను సాధించగలిగింది. కానీ ఈ సినిమా అసలు పరీక్ష ఇప్పుడు మొదలైంది. వర్కింగ్ డే రోజు ఎలాంటి వసూళ్లు రాబడుతోందోనని ట్రేడ్ ఆసక్తిగా గమనిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ ధర పాలికాయి. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ రోజు నుండి డీసెంట్ వసూళ్లు రాబట్టాలి. వీక్ డేస్ లో వర్కింగ్ డే ప్రభావం ఉన్నప్పటికీ సినిమా థియేటర్లలో బలంగా నిలబడితేనే లాభాల బాట పట్టినట్లు భావించవచ్చు. రాబోయే రోజుల్లో నాని ఈ మిక్స్డ్ టాక్ ని సైతం అధిగమించి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పెర్ఫార్మన్స్ చూపిస్తాడో వేచి చూడాలి.

