The Paradise: 20 కోట్ల వ్యూస్‌తో దుమ్మురేపిన ‘ఆయా షేర్’.. ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్‌పై బిగ్ అప్డేట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముందుగా నిర్ణయించిన సమయానికి విడుదల కావాల్సిన ఈ మూవీ ఆగస్టుకు వాయిదా పడగా, తాజాగా మరోసారి విడుదల తేదీ మారే అవకాశముందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. దీంతో అభిమానులు ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్న వేళ చిత్రబృందం ఒక సూపర్ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన తొలి పాట ‘ఆయా షేర్’ మరో అరుదైన రికార్డు సాధించింది. విడుదలైనప్పటి నుంచి మ్యూజిక్ లవర్స్‌ను ఊపేస్తున్న ఈ మాస్ ట్రాక్ తాజాగా 20 కోట్ల వ్యూస్ మార్క్‌ను దాటింది. ఈ మైలురాయిని ప్రకటిస్తూ మేకర్స్ ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. అంతేకాదు, త్వరలోనే అసలైన భారీ అప్డేట్ రాబోతోందని, అందుకు సిద్ధంగా ఉండాలని హింట్ ఇచ్చారు. దీంతో ఆ అప్డేట్ సినిమా కొత్త రిలీజ్ డేట్ గురించే అయి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.
ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. నాని కెరీర్లోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌గా ‘ది ప్యారడైజ్’ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ‘ఆయా షేర్’ పాట విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనదైన ఎనర్జీతో కూడిన బీట్స్, పవర్ఫుల్ కంపోజిషన్‌తో అనిరుధ్ మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు. మరోవైపు నాని అల్ట్రా మాస్ లుక్, స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టాయి. ప్రస్తుతం ఈ ట్రాక్ అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌లలోనూ, సోషల్ మీడియా రీల్స్‌లోనూ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
Also Read
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
రోజురోజుకూ ఈ పాటకు వ్యూస్ పెరుగుతుండటం సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా మారింది. ఈ ఏడాది విడుదలైన అతిపెద్ద చార్ట్‌బస్టర్ పాటల్లో ‘ఆయా షేర్’ ఒకటిగా నిలిచింది. పాట సాధిస్తున్న రికార్డులు చూస్తుంటే సినిమా విడుదల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి మేకర్స్ ప్రకటించబోయే నెక్స్ట్ అప్డేట్పైనే ఉంది. నిజంగానే అది రిలీజ్ డేట్ ప్రకటనేనా? లేక మరో సర్ప్రైజ్ ఉందా? అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఏదేమైనా ‘ది ప్యారడైజ్’ నుంచి రాబోయే అధికారిక ప్రకటన కోసం నాని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- Tags
- cinema
- The Paradise
తాజావార్తలు
-
Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
-
PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
-
WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
-
Zomato: ఫుడ్ లవర్స్‌కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
-
Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్నా? పొంగులేటి ఫైర్
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!