నేచురల్ స్టార్ నాని ఇటీవలే “శ్యామ్ సింగ రాయ్” చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అదే జోష్ లో “అంటే సుందరానికి”, “దసరా” అనే రెండు విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా రూపొందున్న “దసరా”లో కీర్తి సురేష్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్నారు. కామెడీ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి” మూవీకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా, నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తుంది. ఇదిలా ఉండగా మంగళవారం నాని గారాల తనయుడు జున్ను పుట్టినరోజు. ఈ సందర్భంగా జున్నుమ్యాన్ అంటూ నాని తనయుడిని విష్ చేసిన విధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Read Also : NTR 30 : ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన తారక్
తన కొడుకు 5వ పుట్టినరోజు సందర్భంగా నాని షేర్ చేసిన వీడియోలో అర్జున్ బ్యాట్‌మ్యాన్ డ్రెస్ ధరించి కన్పించాడు. ఇంకా నాని తన కొడుకుతో కలిసి ఉన్న కొన్ని మధురమైన క్షణాలు సంబంధించిన ఫోటోలను కూడా ఆ వీడియోలో చూడొచ్చు మనం. “నా చిన్న సూపర్ హీరో జున్నుమాన్ కు 5 సంవత్సరాలు” అంటూ నాని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో నాని, తన కుటుంబంతో కలిసి కన్పించారు. భార్య అంజన, కుమారుడు జున్నుతో కలిసి నాని “ఆర్ఆర్ఆర్” సినిమాను వీక్షించారు.