Nani : మలయాళ స్టార్లతో నాని క్రేజీ ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాని కేవలం నటుడిగానే కాకుండా, అభిరుచి గల నిర్మాతగానూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేశారు. ఇటీవల ఆయన నిర్మించిన ‘కోర్ట్’ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేయడమే కాక, భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సక్సెస్ ఇచ్చిన జోష్‌తో నాని తన ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్‌పై బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ‘కోర్ట్’ చిత్రంతో తనను మెప్పించిన దర్శకుడు రామ్ జగదీష్ కు నాని మరో అవకాశం ఇచ్చారు, ఈసారి కాన్వాస్‌ను మరింత పెంచుతూ, లీడ్ రోల్ కోసం మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కథా చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై ఒక స్పష్టత రానుందని తెలుస్తోంది, దుల్కర్ గనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఇది వాల్ పోస్టర్ సినిమా నుండి వచ్చే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా నిలవడం ఖాయం.
Also Read:Tollywood : సినిమా చూపంతా ఏప్రిల్ వైపే
Also Read
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
- Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
- Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
మరోవైపు, ‘దండోరా’ చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు మురళీకాంత్ తో కూడా నాని ఒక సినిమా చేసేందుకు సిద్ధమయ్యారని, ఈ సినిమా కోసం ‘ప్రేమలు’ మరియు ‘లోకః – చాప్టర్ 1’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ యువ నటుడు నస్లెన్ ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి, ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ సఫలమైతే నస్లెన్ నేరుగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. ఇక వీటితో పాటు తన సోదరి దీప్తి గంటా దర్శకత్వంలో కూడా నాని ఒక సినిమా నిర్మించనున్నారు. ‘మీట్ క్యూట్’ వంటి వెబ్ సిరీస్‌తో తన మార్కును చాటుకున్న దీప్తి, ఈసారి వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ మూడు ప్రాజెక్టులు వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!