Site icon NTV Telugu

Nani : మలయాళ స్టార్లతో నాని క్రేజీ ప్లాన్!

Nani, Venky Atluri

Nani, Venky Atluri, Natural Star Nani Upcoming Films, Nani Bloody Romeo Sujeeth, The Paradise Nani Movie, Sithara Entertainments, Naga Vamsi, Tollywood News 2026.

నాని కేవలం నటుడిగానే కాకుండా, అభిరుచి గల నిర్మాతగానూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేశారు. ఇటీవల ఆయన నిర్మించిన ‘కోర్ట్’ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేయడమే కాక, భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సక్సెస్ ఇచ్చిన జోష్‌తో నాని తన ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్‌పై బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ‘కోర్ట్’ చిత్రంతో తనను మెప్పించిన దర్శకుడు రామ్ జగదీష్ కు నాని మరో అవకాశం ఇచ్చారు, ఈసారి కాన్వాస్‌ను మరింత పెంచుతూ, లీడ్ రోల్ కోసం మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కథా చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై ఒక స్పష్టత రానుందని తెలుస్తోంది, దుల్కర్ గనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఇది వాల్ పోస్టర్ సినిమా నుండి వచ్చే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా నిలవడం ఖాయం.

Also Read:Tollywood : సినిమా చూపంతా ఏప్రిల్ వైపే

మరోవైపు, ‘దండోరా’ చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు మురళీకాంత్ తో కూడా నాని ఒక సినిమా చేసేందుకు సిద్ధమయ్యారని, ఈ సినిమా కోసం ‘ప్రేమలు’ మరియు ‘లోకః – చాప్టర్ 1’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ యువ నటుడు నస్లెన్ ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి, ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ సఫలమైతే నస్లెన్ నేరుగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. ఇక వీటితో పాటు తన సోదరి దీప్తి గంటా దర్శకత్వంలో కూడా నాని ఒక సినిమా నిర్మించనున్నారు. ‘మీట్ క్యూట్’ వంటి వెబ్ సిరీస్‌తో తన మార్కును చాటుకున్న దీప్తి, ఈసారి వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ మూడు ప్రాజెక్టులు వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

Exit mobile version