NTV Telugu Site icon

Nani: పాన్ ఇండియా మూవీ కోసం సూపర్ హిట్ డైరెక్టర్ సెట్టు…

Nani

Nani

దసరా సినిమాతో కెరీర్ లో మొదటిసారి వంద కోట్ల మార్క్ ని రీచ్ అయ్యాడు న్యాచురల్ స్టార్ నాని. మాస్ సినిమాలో కూడా హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ని చూపించొచ్చు అని దసరా సినిమాతో ప్రూవ్ చేసిన నాని, రీసెంట్ గా హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ కొట్టాడు. హాయ్ నాన్న సినిమా కంప్లీట్ గా నాని జానర్ లో ఉండే సినిమా. కొత్త దర్శకుడితో హాయ్ నాన్న సినిమా చేసి హిట్ కొట్టిన నాని… తన నెక్స్ట్ సినిమా పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకు తగ్గట్లు మంచి డైరెక్టర్స్ కోసం చూస్తున్నాడు నాని. ఇతర ఇండస్ట్రీ దర్శకుల నుంచి కూడా కథలు వింటున్న నాని, తమిళ దర్శకులు చెప్పిన కథలు కూడా వింటున్నాడు. సీబీఐ చక్రవర్తితో నాని సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతుంది అనుకున్న సమయంలో ఫైనల్ టాక్స్ లో ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదని సమాచారం.

లేటెస్ట్ గా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ నానికి కథ చెప్పి ఒప్పించడానికి టాక్ వినిపిస్తోంది. జిగర్తాండ, జిగర్తాండ డబుల్ X, పేట, పిజ్జా లాంటి సినిమాలతో కోలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు కార్తీక్ సుబ్బరాజ్. హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ ని ఎక్కువగా ఫాలో అయ్యే కార్తీక్ సుబ్బరాజ్, నాని కాంబినేషన్ లో సినిమా సెట్ అయితే నానికి ప్రాపర్ పాన్ ఇండియా సినిమా పడినట్లే అవుతుంది. కార్తీక్ సుబ్బరాజ్ క్రియేటివ్ గా కథ చెప్తాడు, నాని కంప్లీట్ యాక్టర్ గా కనిపిస్తాడు. ఈ ఇద్దరూ కలిస్తే డిఫినెట్ గా మంచి సినిమా వస్తుంది. మరి కార్తీక్ సుబ్బరాజ్ నాని ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందనేది చూడాలి.