నాని హీరోగా నటిస్తున్న ‘ది పారడైజ్’ సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు సినిమా నిర్మాత సుధాకర్ చెరుకూరి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద ఆయన ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద సూపర్ బజ్ ఉంది. అయితే, తాజాగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాని నిర్మించిన నిర్మాత సుధాకర్ చెరుకూరి, ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ‘పారడైజ్’ గురించి ఆయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి.
Also Read :Ananya Panday : అనన్యా పాండే కొత్త లవ్ స్టోరీ..
‘పారడైజ్’ షూట్ ఎంతవరకు పూర్తయింది అని ఆయన్ని ప్రశ్నించగా, ఇప్పటివరకు పారడైజ్ కి సంబంధించి 60 శాతం షూటింగ్ పూర్తయిందని అన్నారు. అలాగే సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలు అన్నీ పూర్తి చేశామని, సాంగ్స్, ఫైట్స్ దాదాపు పూర్తయ్యాయని అన్నారు. ఇంకా టాకీ మాత్రమే పూర్తవ్వాల్సి ఉందని, అది కూడా వీలైనంత త్వరలో పూర్తి చేస్తామని అన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పారడైజ్ సినిమా వాయిదా పడుతుందా లేదా అనే విషయాన్ని ఆయన కన్ఫర్మ్ చేయలేదు.
Also Read :The Paradise: పెద్ది, ప్యారడైజ్ కలిసి రావు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్?
చెప్పిన డేట్ కే సినిమా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్న ఆయన, ఒకవేళ అవ్వకపోయినా సమ్మర్ లో రిలీజ్ చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాక రామ్ చరణ్ సినిమా, తమ సినిమా ఒకేసారి రిలీజ్ చేసే అవకాశం తక్కువగా ఉందని, వారు కూడా తమ స్నేహితులే కాబట్టి ఒకేసారి రిలీజ్ చేయకుండా వేర్వేరు సమయాల్లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తామని అన్నారు. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ మీద ఇంకా క్లారిటీ లేదని అయితే ఆయన చెప్పుకొచ్చారు. దాదాపుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది కానీ, ఎక్కువగా వాయిదా పడే అవకాశాలే ఉన్నాయని నిర్మాత మాటలను బట్టి అర్థమవుతుంది.
