Nani : నేచురల్ స్టార్ నాని డబుల్ సక్సెస్ అవుతున్నాడు. సాధారణంగా హీరోగా హిట్లు కట్టడానికే నానా ఇబ్బందులు పడుతుంటారు. కానీ నాని మాత్రం ఒకే టైమ్ లో అటు హీరోగా, ఇటు నిర్మాతగా సూపర్ సక్సెస్ అందుకుంటున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. ఒంటరిగానే ఎదుగుతూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నాడు నాని. హీరోగా ఎంతో బిజీగా ఉంటున్నా సరే.. నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. ఏది పడితే అది చేయకుండా.. కేవలం కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. నిర్మాతగా హిట్-1, 2, 3 పార్టులతో సక్సెస్ అందుకున్నాడు.
Read Also : Vishnu Prasad : దారుణం.. ట్రీట్ మెంట్ కు డబ్బుల్లేక స్టార్ యాక్టర్ మృతి..
ఇవే కాకుండా రీసెంట్ గానే కోర్టు సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక హీరోగా మరోసారి హిట్-3తో మరో విజయం అందుకున్నాడు. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో మంచి జోష్ మీద ఉన్నాడు ఈయన. ఇలా నాని వరుస హిట్లు అందుకోవడం చూసి స్టార్ హీరోలు కూడా నేర్చుకోవాలేమో. నాని హిట్ల సీక్రెట్ ఒకటే.. అదే మంచి కంటెంట్. అది ఉంటే చాలు పెట్టిన డబ్బులకు ఎలాంటి టెన్షన్ ఉండదు. సినిమాను ప్రేక్షకులే పెద్ద హిట్ చేసేస్తారు. ఆవేశ పడకుండా.. ఆలోచనతో మంచి కంటెంట్ లను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో హీరోగా, నిర్మాతగా తనకు తిరుగులేదని నిరూపించుకుంటున్నాడు ఈ నేచురల్ స్టార్.
Read Also :Chiranjeevi : ‘విశ్వంభర’ నుంచి త్రిష లుక్ రివిల్.. !
