Alias Rukmini : నాని నిర్మాతగా నితిన్ హీరోగా ‘రుక్మిణీ’ గ్లిమ్స్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్‌గా, యుత్ స్టార్ నితిన్ హీరోగా ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. ‘కోర్ట్’ సినిమాతో నిర్మాతగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని టాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్ స్టేటస్ సొంతం చేసుకున్న నాని, తన స్వంత నిర్మాణ సంస్థ వాల్‌పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. ‘దండోరా’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మురళి కాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
ఈ చిత్రానికి ‘అలియాస్ రుక్మిణీ‘ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం ఒక చిన్న అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో మరియు టైటిల్ చూస్తుంటేనే సినిమా ఎంతటి క్లాసిక్, ప్లెజెంట్ లవ్ అండ్ ఎంటర్టైనింగ్ వైబ్‌తో రాబోతోందో స్పష్టమవుతోంది. గత కొంతకాలంగా మాస్, యాక్షన్ జోనర్లలో ప్రయత్నాలు చేసిన నితిన్.. ఈసారి తన బలమైన ‘రొమాంటిక్-కామెడీ / ఫ్యామిలీ’ జోనర్లోకి మళ్లీ అడుగుపెట్టారు. నితిన్ కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచేలా ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని టాక్. నితిన్‌కు గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చే కంటెంట్ ఇందులో ఉందని ఇన్సైడ్ వర్గాల సమాచారం. నిర్మాతగా ఎప్పుడూ వైవిధ్యమైన, కొత్త తరహా కథలనే ఎంచుకునే నానికి ఈ సబ్జెక్ట్ ఎంతగానో నచ్చడంతో స్వయంగా నిర్మించడానికి ముందుకు వచ్చారు. ప్రొడ్యూసర్‌గా వంద శాతం సక్సెస్ రేట్ ఉన్న నాని జడ్జ్‌మెంట్‌పై ప్రేక్షకుల్లో విపరీతమైన నమ్మకం ఉంది. దీంతో నితిన్ – నాని – మురళి కాంత్ కాంబినేషన్లో రాబోతున్న ‘అలియాస్ రుక్మిణి’ పై అప్పుడే సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
తాజావార్తలు
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
-
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
-
CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!