Alias Rukmini : నాని నిర్మాతగా నితిన్ హీరోగా ‘రుక్మిణీ’ గ్లిమ్స్ రిలీజ్

Rukmini

Rukmini

నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్‌గా, యుత్ స్టార్ నితిన్ హీరోగా ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. ‘కోర్ట్’ సినిమాతో నిర్మాతగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని టాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్ స్టేటస్ సొంతం చేసుకున్న నాని, తన స్వంత నిర్మాణ సంస్థ వాల్‌పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. ‘దండోరా’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మురళి కాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

ఈ చిత్రానికి అలియాస్ రుక్మిణీ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం ఒక చిన్న అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో మరియు టైటిల్ చూస్తుంటేనే సినిమా ఎంతటి క్లాసిక్, ప్లెజెంట్ లవ్ అండ్ ఎంటర్‌టైనింగ్ వైబ్‌తో రాబోతోందో స్పష్టమవుతోంది. గత కొంతకాలంగా మాస్, యాక్షన్ జోనర్లలో ప్రయత్నాలు చేసిన నితిన్.. ఈసారి తన బలమైన ‘రొమాంటిక్-కామెడీ / ఫ్యామిలీ’ జోనర్‌లోకి మళ్లీ అడుగుపెట్టారు. నితిన్ కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచేలా ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని టాక్. నితిన్‌కు గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చే కంటెంట్ ఇందులో ఉందని ఇన్సైడ్ వర్గాల సమాచారం. నిర్మాతగా ఎప్పుడూ వైవిధ్యమైన, కొత్త తరహా కథలనే ఎంచుకునే నానికి ఈ సబ్జెక్ట్ ఎంతగానో నచ్చడంతో స్వయంగా నిర్మించడానికి ముందుకు వచ్చారు. ప్రొడ్యూసర్‌గా వంద శాతం సక్సెస్ రేట్ ఉన్న నాని జడ్జ్‌మెంట్‌పై ప్రేక్షకుల్లో విపరీతమైన నమ్మకం ఉంది. దీంతో నితిన్ – నాని – మురళి కాంత్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘అలియాస్ రుక్మిణి’ పై అప్పుడే సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.