Site icon NTV Telugu

Nani: నెక్స్ట్ సినిమా ఎవరితో నేచురల్ స్టార్?

Nani

Nani

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా ఇండస్ట్రీలోకి వచ్చి ఏదైనా సాధించొచ్చు అని నిన్నటి తరానికి నిరూపించిన వాళ్లు మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజలు అయితే ఈ జనరేషన్ లో ఆ మాటని నిజం చేసి చూపించ వాడు ‘నాని’. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరో అయిన నాని, ‘పక్కింటి కుర్రాడిలా ఉన్నాడే అనే దగ్గర నుంచి నేచురల్ స్టార్’ అనిపించుకునే వరకూ ఎదిగాడు. ఒకానొక సమయంలో నాని డబుల్ హ్యాట్రిక్ హిట్ కొట్టి, ఈ జనరేషన్ లో ఏ హీరోకైనా కలలో కూడా ఊహించలేని రేంజులో ఒకే ఏడాది మూడు సినిమాలు రిలీజ్ చేసి, మూడూ సూపర్ హిట్స్ కొట్టాడు. ఇలా రెండు సార్లు చేసిన నాని, ఇప్పటివరకూ 29 సినిమాలు నటించాడు. 29 సినిమాల్లో 29 ఎమోషన్స్ ప్రెజెంట్ చేసిన నాని, ప్రస్తుతం ‘దసరా’ సినిమాలో నటిస్తున్నాడు.

తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ మార్కెట్ పెంచుకున్న నాని, పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘దసరా’ సినిమా చేస్తున్నాడు. చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ‘దసరా’ సినిమాలో నాని రగ్గడ్ లుక్ లో, ముందెన్నడూ కనిపించనంత రఫ్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిపోతే నాని నెక్స్ట్ సినిమా ఎవరితో అనే క్లారిటీ ఎవరికీ లేదు. ఈ సస్పెన్స్ ని ఎండ్ కార్డ్ వేస్తూ… నాని నటించబోయే నెక్స్ట్ సినిమా వివరాలని ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి అనౌన్స్ చెయ్యబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక వీడియో బయటకి వచ్చింది. ఇందులో నాని నటించిన సినిమాల తాలూకు పోస్టర్స్ ఉన్నాయి, వీడియో ఎండ్ లో నాని నెక్స్ట్ మూవీ గురించి ఈరోజు అనౌన్స్ చేస్తామనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ వీడియో చూస్తుంటే నాని, ఫోటోగ్రాఫర్ రోల్ లో నటిస్తున్నాడేమో అనిపిస్తోంది. మరి కాసేపట్లో అఫీషియల్ గా బయటకి రానున్న అనౌన్స్మెంట్ లో నాని ఏ సర్పైజ్ ప్లాన్ చేశాడో చూడాలి.

Exit mobile version