NTV Telugu Site icon

Hi Nanna Twitter Review: నాని హాయ్ నాన్నతో హిట్ కొట్టేసినట్లేనా?

Hi Nanna

Hi Nanna

న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న… ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ ఫీల్ గుడ్ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. డెబ్యూ డైరెక్టర్ శౌర్యవ్ తెరకెక్కించిన ఈ సినిమాకి హేషం అబ్దుల్ వాహబ్ ఇచ్చిన మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ సినిమాకి అన్ని సెంటర్స్ లో మార్నింగ్ షో కూడా పడిపోయింది. సోషల్ మీడియాలో హాయ్ నాన్న సినిమా చూసిన వాళ్లు కంప్లీట్ గా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. నాని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇతర సినీ అభిమానులు కూడా హాయ్ నాన్న సినిమాపై పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

ఒక మంచి ప్రేమ కథని ప్రెజెంట్ చేయడంలో నాని ఎప్పుడూ ముందుంటాడు. హాయ్ నాన్న సినిమా కూడా నాని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ లో ఒకటిగా నిలుస్తుంది అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఎమోషనల్ సీన్స్ లో నాని యాక్టింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తన మ్యాజిక్ తో పాటు మృణాల్ ఠాకూర్ కూడా తోడవడంతో హాయ్ నాన్న మూవీ కథలో, రైటింగ్ లో కొంచెం ఫ్లాస్ ఉన్నా కూడా అవేమి పెద్ద లోపాల్లా కనిపించకుండా చేసారు. హేషం సినిమాని కంప్లీట్ గా మ్యూజిక్ తో మోసుకెళ్లాడు, తన మ్యూజిక్ లేని సినిమాని ఊహించడం కష్టమే. ఓవరాల్ గా నాని దసరా తర్వాత మరో హిట్ కొట్టాడు అని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అసలు హైప్ లేకుండా రిలీజ్ అయిన ఒక సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Show comments