ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని హవా నడుస్తోంది.. ఎక్కడ చూసినా ‘అంటే సుందరానికీ’ మూవీ ప్రమోషన్సే కనిపిస్తున్నాయి. వివేక్ అత్ర్య దర్శకత్వంలో నాని, నజ్రియా జంటగా నటిస్తున్న చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ జోరు పెంచేసిన చిత్రబృందం వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించే కాకుండా పలు ఆసక్తికరమైన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాని తన తదుపరి సినిమాల గురించి వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టాడు.
గత కొన్ని రోజుల నుంచి త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో వస్తున్న చిత్రంలో మరో హీరోగా నాని నటిస్తున్నాడంటూ వార్తలు గుప్పుమన్న విషయం విదితమే.. ఇక తాజాగా ఈ విషయంపై నాని మాట్లాడుతూ ఆ వార్తలో ఎటువంటి నిజం లేదు.. అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తున్నాయో ఆదరం కావడం లేదని తెలిపాడు. అంతేకాకుండా తలపతి 66 కూడా తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తాను దసరా సినిమాలో మాత్రం నటిస్తున్నా అని, కొత్త ప్రాజెక్ట్స్ వింటున్నానని అని చెప్పుకొచ్చాడు. దీంతో ఆ రూమర్స్ కు చెక్ పడినట్లే.. మరి అవుట్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రంతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
