Spark of Dasara అంటూ తాజాగా “దసరా” చిత్రం నుంచి నాని ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఇటీవల “శ్యామ్ సింగ రాయ్” సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు నేచురల్ స్టార్ నాని. తాజాగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న “దసరా” అనే మాస్ ఎంటర్‌టైనర్ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా, తాజాగా ఆసక్తికర అప్డేట్ ను షేర్ చేశారు మేకర్స్. తాజాగా Spark of Dasara అంటూ సినిమాలో నుంచి నాని ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ లో నాని ట్రాన్స్ఫర్మేషన్ ను చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఊర మాస్ లుక్ లో సరికొత్త మేకోవర్ లో కనిపిస్తున్నాడు నాని.
Read Also : RRR Pre Release Event : గెస్ట్ గా కర్ణాటక సీఎం ఎందుకొచ్చారంటే ?
గ్రామీణ నేపధ్యంలో కొనసాగనున్న ఈ సినిమాలో నాని కొత్త మేకోవర్ ఎంచుకోవడం హాట్ టాపిక్ అని చెప్పాలి. ఎందుకంటే ఇదివరకు నాని చేసిన అన్ని సినిమాల్లో దాదాపు ఒకే మేకోవర్ ను మెయింటైన్ చేస్తున్నాడు అనే టాక్ ఉంది. ఫస్ట్ లుక్ తో పాటు విడుదల చేసిన “దసరా” ఫస్ట్ గ్లింప్స్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇక “దసరా” చిత్రం విలేజ్ ఎంటర్టైనర్. ఇందులో నాని తెలంగాణ యాసలో అదరగొట్టబోతున్నాడు. ఫస్ట్ లుక్ చూస్తుంటే మూవీలో నాని మాస్ అండ్ యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నాడని అర్థమవుతోంది. ఇక ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు నటిస్తున్నారు. “దసరా” చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘దసరా’కు సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూర్చారు.
