NTV Telugu Site icon

Hi Nanna: ఈ సినిమా కథ ఒరిజినల్… ఫ్యామిలీని కలిసి నాని అండ్ టీమ్…

Hi Nanna

Hi Nanna

న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. అనిమల్ సినిమా ముందు హాయ్ నాన్న కనపడేమో అనుకున్న ప్రతి ఒక్కరికీ షాక్ ఇస్తూ సినిమా చాలా బాగా ఆడుతుంది. ఇప్పటికి సిటీలోని కొన్ని మేజర్ సెంటర్స్ లో హాయ్ నాన్న సినిమా మంచి బుకింగ్స్ నే రాబడుతుంది. నాని మార్క్ యాక్టింగ్, మృణాల్ పెర్ఫార్మెన్స్, బేబీ కియారా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ హాయ్ నాన్న సినిమాని బ్యూటిఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గా మార్చేశాయి. ఒక మంచి లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఒరిజినల్ స్టోరీ అనే విషయం చాలా మందికి తెలియదు. హాయ్ నాన్న సినిమా చూసిన తర్వాత సోషల్ మీడియాలో విహాన్ సీఎఫ్ ఇండియా అనే అకౌంట్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది.

“ఈ సినిమాలో మా జీవితాన్ని మళ్లీ చూపించింది. ఇందులో పాప ఉన్నట్లే మా లైఫ్ లో బాబు ఉన్నాడు, విహాన్. మా బాబుకి కూడా సిస్టిక్ ఫైబ్రోసిస్ అన్నారు… సినిమాలో ప్రతి సీన్ మాకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది. మా లైఫ్ నే స్క్రీన్ పైన చూస్తున్నట్లు అనిపించింది” అంటూ విహాన్ కృష్ణ అకౌంట్ నుంచి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది. ఈ పోస్ట్ చూసిన డైరెక్టర్ శౌర్యవ్… “ఏం మాట్లాడాలో తెలియట్లేదు అండి, త్వరలో టీమ్ అంతా వచ్చి మిమ్మల్ని కలుస్తాం” అంటూ రిప్లై ఇచ్చారు.

ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ నాని, మృణాల్, బేబీ కియారా, ప్రియదర్శి, శౌర్యవ్… విహాన్ కృష్ణ ను కలిసి క్వాలిటీ టైమ్ ని స్పెండ్ చేసారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. హాయ్ నాన్న సినిమాలోనే సిస్టిక్ ఫైబ్రోసిస్ గురించి, 65 రొసెస్ అని చెప్తుంటే థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ కే ఎమోషనల్ గా అనిపిస్తుంది అలాంటిది శ్వేతా అండ్ తన హస్బెండ్ రియల్ లైఫ్ లో విహాన్ కి వచ్చిన సిస్టిక్ ఫైబ్రోసిస్ ని ఎలా ఫేస్ చేయగలుగుతున్నారు అనేది ఊహించడం కూడా కష్టమే. ఈ కష్టంలో కూడా విహాన్ కృష్ణ పేరెంట్స్ ఇండియాలో సిస్టిక్ ఫైబ్రోసిస్ గురించి అవేర్నెస్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

10