Site icon NTV Telugu

Nandamuri Hero: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నందమూరి హీరో మాస్ వార్నింగ్.. టచ్ కూడా చేయలేరు అంటూ!

Chaitanya Krishna Vs Jr Ntr

Chaitanya Krishna Vs Jr Ntr

Nandamuri Krishna Chaitanya Warning to Jr NTR Fans: ఏపీలో ఎన్నికలు ముగిసిన ఇంకా ఎన్నికలకు సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నందమూరి హీరో ఒకరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశిస్తూ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ చాలా కాలం క్రితమే నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. గత ఏడాది బ్రీత్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే తెలుగుదేశం గెలవాలని సోషల్ మీడియా వేదికగా గతంలో పోస్టులు పెడుతూ వచ్చిన ఆయన తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను టార్గెట్ చేస్తూ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ గురించి చర్చ జరుగుతోంది.

Esther Anil: దృశ్యం పాప ఎద అందాల విందు.. చూపు తిప్పుకోలేరంతే !

వైసీపీకి సపోర్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ ఇదే వార్నింగ్, ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ. మీరు సపోర్ట్ చేశారు అంటున్నారు, అయినా సరే మీరెవరో మా బొ* కూడా పీకలేరు. నేనుండగా మా చంద్రబాబు నాయుడు మావయ్య, నందమూరి బాలకృష్ణ బాబాయ్ ని టచ్ కూడా చేయలేరు. నా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైసీపీ కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారు, జాగ్రత్తగా ఉండండి అంటూ తన ఫేస్ బుక్ పేజ్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్ మీద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. మరోపక్క నందమూరి అభిమానులు మాత్రం వెరీ గుడ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. గత కొంత కాలంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ టిడిపి ఫ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యుద్ధాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Exit mobile version