Site icon NTV Telugu

Kalyan Ram: అమిగోస్ నుంచి ఫస్ట్ సాంగ్ వస్తోంది…

Amigos Songs

Amigos Songs

నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి జోష్ లో ఉన్నాడు. హిట్ ఇచ్చిన ఉత్సాహంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న కళ్యాణ్ రామ్ ఫిబ్రవరి 10న ‘అమిగోస్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు. మూడు డిఫరెంట్ షేడ్స్ లో కళ్యాణ్ రామ్ కనిపించనున్న ‘అమిగోస్’ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. సాఫ్ట్ లుక్, స్టైలిష్ లుక్, నెగటివ్ షెడ్ ఉన్న లుక్ ఇలా డిఫరెంట్ లుక్స్ లో కళ్యాణ్ రామ్ లో కనిపించనున్నాడు. ఈ అంచనాలని మరింత పెంచడానికి చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తున్నారు.

Read Also: Ananya Nagalla: ఈసారి పెద్దగానే చేస్తోంది…

న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒకదాని తర్వాత ఇంకొకటి గ్యాప్ లేకుండా పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్, అమిగోస్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొదటి సాంగ్ ని త్వరలో రిలీజ్ చేస్తామని మేకర్స్ అన్నౌంక్ చేశారు. ఘిబ్రాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు అంటే ఆ మూవీ మ్యూజికల్ గా హిట్ అనే కాన్ఫిడెన్స్ అందరిలోనూ ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని అమిగోస్ మొదటి సాంగ్ నిలబెడుతుందో లేదో చూడాలి. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. మైండ్ గేమ్, యాక్షన్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ ఇలా అమిగోస్ సినిమా ఏ జోనర్ లో తెరకెక్కుతుంది అనే విషయాన్ని ఇప్పటివరకూ చిత్ర యూనిట్ దాచారు మరి టీజర్ లో ఏమైనా ప్రెజెంట్ చేస్తారో చూడాలి.

Read Also: Amigos: ఇంతకీ ఈ ముగ్గురూ ఎక్కడ కలుస్తారు?

Exit mobile version