Site icon NTV Telugu

Amigos: కళ్యాణ్ రామ్ ట్రిపుల్ యాక్షన్ కి U/A…

Amigos

Amigos

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’. ఒకేలా ఉన్న అస్సలు సంబంధం లేని ముగ్గరు వ్యక్తులు స్నేహితులు ఎలా అయ్యారు? అసలు ఆ ముగ్గురు ఏం చేస్తూ ఉంటారు? ఒకేలా ఉన్న వాళ్లు ఎలా కలిసారు? ఎందుకు కలిసారు? సమయం వచ్చినప్పుడు విడిపోవాలని ఎందుకు అనుకున్నారు లాంటి ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ తో ‘అమిగోస్’ సినిమా తెరకెక్కింది. రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 10న ఆడియన్స్ ముందుకి రానున్న అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటివలే గ్రాండ్ గా జరిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా వచ్చి నందమూరి అభిమానులకి కిక్ ఇచ్చాడు. పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ లోనూ కొత్తదనం చూపిస్తూ థియేటర్స్ కి వెళ్తే డిజప్పాయింట్ అవ్వము అనే నమ్మకాన్ని ఆడియన్స్ కి కలిగించడంలో మేకర్స్ సక్సస్ అయ్యారు.

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అమిగోస్ సినిమాకి క్లీన్ U/A సర్టిఫికేట్ వచ్చింది. ఒక యాక్షన్ సినిమాకి U/A సర్టిఫికేట్ వచ్చింది అంటే అమిగోస్ సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంటుంది. ఈ ఫ్రైడే కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ లో చేసిన పెర్ఫార్మెన్స్ ని చూడడానికి అమిగోస్ రిలీజ్ అయిన థియేటర్స్ కి వెళ్లిపోయి ఎంజాయ్ చెయ్యడానికి నందమూరి అభిమానులు రెడీ అయ్యారు. ఇప్పటికే నందమూరి తారక రామారావు, బాలయ్య, ఎన్టీఆర్ లు ట్రిపుల్ రోల్ ప్లే చేస్తూ సినిమాలు చేశారు. ఎన్టీఆర్ అయితే జై లవ కుశ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టే కొట్టాడు. మరి ఫ్యామిలీ హిస్టరీని బేస్ చేసుకోని కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ లో హిట్ ఇస్తాడా? లేక మంచి ప్రయోగం చేశాడు అని మాత్రమే అనిపించుకుంటాడా అనేది చూడాలి.

Exit mobile version