Site icon NTV Telugu

NKR19: దాదాపుగా పూర్తయిన కళ్యాణ్ రామ్ కొత్త సినిమా షూటింగ్

Nkr Latest Movie

Nkr Latest Movie

NKR19:  ‘బింబిసార’ చిత్రంతో సూపర్ హిట్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన నటిస్తున్న 19వ చిత్రం ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాను రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న ఆషిక రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రీసెంట్‌గా జరిగిన గోవా షెడ్యూల్‌తో దాదాపు సినిమా పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌. సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు. త్వర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

Exit mobile version