NBK 109: నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఎన్బికె 109 సినిమా తెరకెక్కుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ బాబీ. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల మీద నాగ వంశీతో పాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జైపూర్ లో జరిగింది. ఈ షూటింగ్ షెడ్యూల్ ముగిసినట్లు బాబి తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఒక ఇంటెన్స్ షెడ్యూల్ జైపూర్లో ముగిసిందని ఆయన ఎనర్జీ ఇంకెవరు మ్యాచ్ చేయలేరని చెప్పకొచ్చారు.
Also Read; Chiyan Vikram: అపరిచితుడు విజయవాడలో రికార్డ్.. విక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ప్రతి మూమెంట్ ని ఆయన తనదైన శైలిలో మెరిసేలా చేశారని బాలకృష్ణతో కొన్ని అద్భుతమైన సీక్వెన్స్ లో ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీగా ఉండాలి అంటూ బాబీ ట్వీట్ చేశాడు. అంతేకాక టైటిల్ టీజర్ త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఈ సినిమాకి వీరమాస్ అనే ఒక టైటిల్ పరిశీలిస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అయితే ఇలాంటి టైటిల్ తమ హీరో సినిమాకి పెట్టకూడదు అంటూ సోషల్ మీడియా వేదికగానే నందమూరి అభిమానులు రిక్వెస్ట్ లు పెట్టారు. ఈ నేపథ్యంలో అలాంటి టైటిల్ పెడతారా లేక మరేదైనా టైటిల్ పెడతారా అనే విషయం క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.