NBK 111 : షూటింగ్ లో బాలయ్య కు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు

Nbk111

Nbk111

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం NBK111. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో సతీష్ కిలారు భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పోర్ట్ ప్రాంగణంలో శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే అక్కడ చిత్రీకరణ జరుపుతుండగా బాలయ్య ప్రమాదవశాత్తూ జారిపడ్డారు.

షూటింగ్ స్పాట్‌లో అకస్మాత్తుగా జారిపడటంతో బాలకృష్ణ మోకాలికి బలమైన దెబ్బతగిలినట్లు సమాచారం. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ సభ్యులు బాలయ్యను దగ్గరలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు బాలయ్యకు చికిత్స అందిస్తున్నారు. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు వైద్యులు బాలయ్య మోకాలికి స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ స్కానింగ్ రిపోర్టులు రావాల్సి ఉంది. వైద్య పరీక్షల అనంతరం ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు వెలువడే అవకాశముంది. ప్రమాదానికి గురయ్యారనే వార్త నందమూరి అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.