NTV Telugu Site icon

Namo Movie: నరేంద్ర మోడీ అనుకునేరు… కామెడీ సినిమా టైటిల్!

Namo Look

Namo Look

Namo Movie First Look Released by Bhimineni Sreenivasa Rao: ఎన్ని సినిమాలు వస్తున్నా కామెడీ సినిమాల ప్రేక్షకులు ఉంటూనే ఉంటారు. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అన్న తేడా చూడకుండా.. నవ్వులు పంచే సినిమా అయితే చాలు హిట్ చేస్తామని ప్రేక్షకులు ఎన్నో సార్లు నిరూపించారు. ఈ క్రమంలోనే సర్వైవల్ కామెడీ జానర్‌లో పూర్తి వినోదాత్మక చిత్రంగా ‘నమో’ను తెరకెక్కిస్తున్నారు. విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలు విస్మయ హీరోయిన్‌గా శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఏ ప్రశాంత్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. శనివారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ కార్యక్రమాన్ని ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

Bigg Boss Telugu 7: ఈ వారం కూడా షాకింగ్ ఎలిమినేషనే.. ఎవరు అవుట్ అయ్యారంటే?

ఈ కార్యక్రమంలో భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఆదిత్య నా దగ్గర అసిస్టెంట్‌గా పని చేశారు, ఎంతో సిన్సియర్‌గా పని చేసేవాడు. రెండు మూడేళ్లు నా దగ్గర ఎంతో అకింతభావంతో పని చేశాడు, ఏదో చేయాలని, నేర్చుకోవాలన్న తపన ఉంటే అవకాశాలు వస్తాయి. నమో అనే పేరు వినగానే.. నరేంద్ర మోదీ గారి మీద కథ అనుకున్నా కానీ నగేష్, మోహన్ అని హీరోల పాత్రల పేర్ల మీద టైటిల్ పెట్టానని తెలిపాడు. ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆదిత్య రెడ్డి కుందూరు మాట్లాడుతూ మా సినిమా చాలా బాగా వచ్చింది, సినిమాను చూసి హాయిగా నవ్వుకునేలా ఉంటుందని అన్నారు. హీరోయిన్ విస్మయ మాట్లాడుతూ మా సినిమాలో ఫుల్ ఫన్ ఉంటుంది, విశ్వంత్ చాలా బాగా నటించారు, అనురూప్ పాత్ర బాగుంటుందని అన్నారు.

Show comments