Namitha Says She was Cheated by a producer: సొంతం, జెమిని సినిమాలతో పాపులర్ హీరోయిన్‌గా మారి తెలుగు ప్రేక్షకులు దగ్గరైన ముద్దుగుమ్మ నమిత. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘సింహా’ సినిమాలో సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే అనే పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటలో నమిత హాట్‌గా కనిపించి కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టించింది. ఆ తర్వాత నమిత విజయకాంత్ నటించిన మా అన్న చిత్రంతో తమిళంలో నటిగా అరంగేట్రం చేసింది. ఆమెకు తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి ఆదరణ లభించింది. దిగన్, ఇంగ్లీస్ఖరన్, చాణకియ, బంబారా కన్నాలే, కోయంబత్తూర్ బ్రదర్స్, పచ్చ ఉద్దీ, వయారి, నాన్ అవన్ అలై, అజ్జయ తమిళ్ మగన్, బిల్లా.. ఇలా మంచి సినిమాల్లో పలువురు ప్రముఖ హీరోలతో కలిసి నటించింది. ఈమధ్య బీజేపీలో చేరిన ఆమె పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కూడా చేసింది. ఈ నేపథ్యంలో నటి నమిత ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతోంది.
Maidaan OTT: ఓటీటీలోకి అజయ్ దేవ్‌గణ్ ‘మైదాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ ఇంటర్వ్యూలో నమిత మాట్లాడుతూ.. ధనుష్ సినిమాలో కాల్షీట్ అడిగి ఒక నిర్మాత మోసం చేశాడని చెప్పింది. 2006లో ఓ సినిమాలో నటించమని నన్ను అడిగారు. ఆ సినిమా పేరు చెప్పనక్కర్లేదు, ఆ సినిమా నిర్మాత ధనుష్ ఈ సినిమాలో నీ సరసన నటిస్తానని చెప్పి నా కాల్షీట్ తీసుకున్నాడు. “కానీ ఆఖరికి నిర్మాత కజిన్ ఆ సినిమాలో హీరోగా నటించాడు. ఆ విషయం తెలియగానే చాలా బాధపడి సగంలోనే సినిమా నుంచి బయటకు వచ్చేశా, ఆపై ఎలాగోలా సినిమా పూర్తి చేసి విడుదల చేశారు. ఈ విషయం మీద ‘అప్పట్లో నిర్మాతల మండలికి, నటీనటుల మండలికి ఫిర్యాదు చేశాను’ అంటూ నటి నమిత చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.