NTV Telugu Site icon

The Ghost: నాగ్ బిగి కౌగిలిలో బాలయ్య హీరోయిన్..

Nag

Nag

The Ghost: అక్కినేని నాగార్జున- ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది ఘోస్ట్’. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి- నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ్ సరసన సోనాల్ చోహన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పవర్ ఫుల్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నాగ్ ఇందులో కనిపించనున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ల జోరు పెంచేసిన మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ కు ముహూర్తం ఖరారు చేశారు.

ఆగస్టు 25 న ది ఘోస్ట్ ట్రైలర్ రాబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో యుద్ధభేరిలో ఉన్న నాగ్ కౌగిలిలో సోనాల్ ఒదిగిపోయింది. చుట్టూ శిధిలాలు.. మంటల మధ్య ది ఘోస్ట్ రొమాన్స్ చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో నాగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Show comments