Nagarjuna Targets Pallavi Prashanth about Plant in Bigg Boss 7: ‘బిగ్‌బాస్’లో మిగతా రోజులు ఎలా ఉన్నాసరే వీకెండ్ వచ్చేసరికి మాత్రం అంతా కలర్‌ఫుల్ గా మారిపోయి ఒక కొత్త హౌస్ అనే ఫీల్ తీసుకొస్తారు, శని ఆదివారాల్లో నాగార్జున కనిపిస్తాడు కాబట్టి హౌస్ మేట్స్ అందరూ ఫుల్ గా రెడీ అయి విత్ మేకప్ అలరిస్తారు. ఇక ఈరోజు శనివారం కావడంతో ఈరోజు టెలికాస్ట్ రాబోయే ఎపిసోడ్ లో నాగార్జున కనిపించనున్నారు. ఇక ఈరోజు కంటెస్టెంట్స్ వారం రోజుల పాటు చేసిన సంగతుల‍్ని స్టేజీపై మరోసారి డిస్కస్ చేస్తాడు నాగార్జున. ఆ క్రమంలో బాగా ఆడిన వారిని మెచ్చుకుంటాడు, ఆడకుండా వేషాలు వేసిన వారిని అక్కడే కడిగి పారేస్తాడు. అలా ఈ శనివారం.. ఏం జరిగింది? అనేది ప్రోమోలో కొంత చూపించారు. ఇక ఈరోజు ప్రోమోలో నాగార్జున కింగ్స్ మీటర్ అనే ఒక పరికరాన్ని తెచ్చి పెట్టారు.
Umapathy Ramaiah: స్టార్ హీరో కుతూర్ని లవ్లో పడేసి ఏకంగా హీరో అయిపోయిన కమెడియన్ కొడుకు
శివాజీ కింగ్స్ మీటర్ అని చెబుతూ ముందు బాగానే ఆడుతున్నావ్ అని అంటూ మొన్నటి టాస్క్ గురించి మెచ్చుకుంటూనే మరోపక్క ఒక్క సారి డోర్ తీయి వెళ్ళిపోతా అని అంటూ బిగ్ బాస్ ని బెదిరిస్తున్న అంశం మీద కౌంటర్లు వేశారు షకీలా పద్ధతి కూడా ఏమీ బాలేదు అని అంటూ ఆమె ప్రతి విషయానికి వయసు గుర్తు చేస్తుంటే ఆ విషయం మీద కౌంటర్ వేశారు. ఇక అమర్ దీప్ తో మాట్లాడుతూ ప్రశాంత్ ను నామినేట్ చేసినప్పుడు చెప్పిన మోనోలాగ్(బీటెక్ కష్టాలు) గుర్తు చేసి ఎందుకలా అన్నావని అంటూ ఆయనకు క్లాస్ పీకారు. మరోపక్క ప్రశాంత్ ను కూడా ఒక రేంజ్ లో ఆదుకున్నారు. నువ్వు రైతు బిడ్డవి అని చెప్పడానికి గర్వంగా ఉండేది కానీ ఇలా చేయడం ఏమాత్రం బాలేదు అని చెబుతూ మొదటి రోజు అతనికి ఇచ్చి పంపిన మొక్కను చూపించారు. ఒక మొక్కను సరిగా పెంచలేని వాడివి నువ్వేం రైతు బిడ్డవి అనిఅడిగే సరికి ప్రశాంత్ కొయ్యబారిపోయాడు.