Site icon NTV Telugu

Naa Saami Ranga: థియేటర్ల వేటలో నా సామి రంగా!

Nagarjuna

Nagarjuna

Nagarjuna in search of theaters for Naa Saami Ranga: బంగార్రాజు అనే సినిమా చేసి హిట్ అందుకున్న నాగార్జున ఆ తరువాత ఘోస్ట్ సినిమాతో మళ్ళీ ఫ్లాప్ అందుకున్నాడు. అందుకే ఈసారి ఆయన హీరోగా నటిస్తున్న తన నా సామి రంగ సినిమాను సంక్రాంతికి మాత్రమే విడుదల చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నాడు. నిజానికి ఆయన ఈ సినిమాతో ఒక బ్లాక్‌బస్టర్‌ను అందించాలని కోరుకుంటున్న క్రమంలో సినిమాను వేరే తేదీకి మార్చడానికి ఆయన ఏమాత్రం ఇష్టపడడం లేదు. సంక్రాంతి సీజన్‌లో రీలీజ్ చేస్తే ఫలితం కొంచెం అటూ ఇటూ అయినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, ఖచ్చితంగా హిట్ అవుతుందని అయన భావిస్తున్నాడు. అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ వంటి కుర్ర హీరోలు కూడా ఉండడంతో నా సామి రంగా మంచి కమర్షియల్ ప్యాకేజీలానే అనిపిస్తోంది.

Gorantla Butchaiah Chowdary: ఇంట గెలవలేని వాడు రచ్చ గెలుస్తాడా.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు

ఈ క్రమంలో నాగ్ కోరిక మేరకు నా సామి రంగా టీమ్ షూటింగ్ స‌మ‌యానికి పూర్తి చేసేందుకు చాలా క‌ష్ట‌ప‌డి, సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని ప‌గలు రాత్రి కష్ట పడుతోంది. అయితే ప్రమోషనల్ కంటెంట్ కూడా బాగానే ఉంది కానీ సినిమా విడుదలకు తగినన్ని థియేటర్లు దొరకడం లేదనేది ప్రధాన సమస్య. C&D సెంటర్‌లలో అయితే ఇప్పటికే వేరే సినిమాల కోసం అన్ని థియేటర్లు లాక్ చేయబడ్డాయి, ఈ క్రమంలో నాసామి రంగ కి A,B సెంటర్‌లలో కూడా గట్టి పోటీ ఉండడంతో అక్కడ కూడా థియేటర్లు దొరకడం కష్టంగానే అనిపిస్తోంది. దీంతో నాగార్జున అసంతృప్తితో ఉన్నారని, ఇదే విషయాన్ని నిర్మాతలకు తెలిపారని సమాచారం. ఇప్పుడు నిర్మాతలు – డిస్ట్రిబ్యూటర్ ఈ సమస్యలను పరిష్కరించడానికి – విడుదల తేదీ ప్లాన్ గురించి చర్చించడానికి సమావేశమవుతున్నారు. అవసరమైతే నాగార్జున తన అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ను కూడా వాడేందుకు సిద్ధం అవుతున్నట్టు చెబుతున్నారు.

Exit mobile version