Site icon NTV Telugu

Bigg Boss 6 promo shoot :బిగ్ బాస్ 6 ప్రోమో షూట్ లో నాగార్జున

Big Boss6

Big Boss6

Nagarjuna in Bigg Boss 6 promo shoot
రియాలిటి షో బిగ్ బాస్ తెలుగుకి ఆదరణ క్రమేపి తగ్గుతున్నప్పటికీ అందులో పాల్గొనాలనే ఆసక్తిని వ్యక్త పరిచే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక బిగ్‌బాస్ 6 సెప్టెంబర్ 2వ వారంలో ప్రారంభం కానుంది. దీనికోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో మంగళవారం బిగ్ బాస్ 6 ప్రమోషనల్ ప్రోమో షూటింగ్‌లో నాగార్జున పాల్గొన్నారు. తొలి, మలి సీజన్స్ కు ఎన్టీఆర్, నాని హోస్ట్ లు గా వ్యవహరించగా ఆ తర్వాత మూడు సీజన్స్ కు నాగార్జుననే హోస్ట్. ఇక తొలి సీజన్ విన్నర్ శివబాలాజీ కాగా ఆపై వరుసగా కుశాల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్, విజె సన్నీ విజేతలుగా నిలిచారు. ఇక బిగ్ బాస్ 6 ప్రోమో కోసం క్రియేటివ్ టీమ్ కొత్త కాన్సెప్ట్ ను క్రియేట్ చేసిందట. అంతే కాదు ఇప్పటికే ఈ షోలో పాల్గొనటానికి ఆసక్తిని వ్యక్తం చేసిన ప్రముఖుల ఇంటర్వ్యూలను కూడా కండక్ట్ చేస్తున్నట్లు సమాచారం. అవి పూర్తి కాగానే ఆ యా వ్యక్తుల బలాబలాలు, బలహీనతలు, పాజిటివ్‌, నెగటివ్‌ పాయింట్లను బేస్ చేసుకుని పార్టిసిపెంట్స్ ను ఎంపిక చేయనున్నారు. మొత్తం మీద ఓ వారంలోనే ఈ జాబితా బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఈ సారైనా ఇమేజ్ ఉన్నవారిని ఎంపిక చేసి షోను ఆసక్తి కరంగా మలుస్తారని ఆశిద్దాం.

Exit mobile version