Site icon NTV Telugu

Nagarjuna: కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, హరికృష్ణలు టైగర్, సింహాలు అన్న నాగార్జున.. కానీ బాలయ్యని మాత్రం?

Nagarjuna

Nagarjuna

Nagarjuna Comments about Nandamuri Family goes viral: బిగ్ బాస్ సీజన్ 7 ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. ఇక ఈ ఏడవ సీజన్ కి గాను రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఇక దాదాపు నాలుగు గంటలు సాగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి పలువురు సెలబ్రిటీలు అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ బిగ్ బాస్ సీజన్ 7 ఫినాలేలో మాస్ మహారాజ్ రవితేజ, నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, అల్లరి నరేష్, సుమ కనకాల, రాజ్ తరుణ్ వంటి వారు సందడి చేశారు. ఇక కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ ఇద్దరూ తమ డెవిల్ సినిమా ప్రమోషన్స్ కూడా అదే స్టేజ్ మీద చేసుకున్నారు. ఈ క్రమంలోనే డెవిల్ ట్రైలర్ ని ప్రదర్శించగా ట్రైలర్ అద్భుతంగా ఉండగా నాగార్జున కళ్యాణ్ రామ్ ని అభినందించారు. నాగార్జున డెవిల్ ట్రైలర్ చూశాక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Salaar Release Trailer: బిగ్ బ్రేకింగ్.. సలార్ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది

డెవిల్ ట్రైలర్ చివర్లో విశ్వాసంగా ఉండడానికి కుక్కననుకున్నావు రా కాదు లయన్ అంటూ కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ గా చెప్పే డైలాగ్ ఉండగా దాని గురించి నాగార్జున మాట్లాడుతూ నాకు తెలిసిన టైగర్ అన్నయ్య హరికృష్ణ, ఆ తర్వాత నువ్వు.. ఆ తర్వాత తారక్ అని అన్నారు. తారక్ యంగ్ టైగర్ అని కళ్యాణ్ రామ్ అనగా ఇప్పుడు నువ్వు లయన్ అంటూ నాగ్ అభినందించారు. ఇక నాగార్జున చేసిన వ్యాఖ్యలు నందమూరి అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఎందుకంటే నాగార్జున, బాలకృష్ణ మధ్య విభేదాలు ఉన్నాయని ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది. హరికృష్ణ కుటుంబాన్ని సింహాలతో, పులులతో నాగ్ పోల్చి బాలయ్య ప్రస్తావన తీయకపోవడంతో హాట్ టాపిక్ అయింది. నందమూరి ఫ్యామిలిలో సింహం అంటే అభిమానులకు గుర్తుకు వచ్చేది బాలయ్యే అయితే నాగార్జున తెలివిగా తనకి బాగా సాన్నిహిత్యం ఉన్న హరికృష్ణ కుటుంబాన్ని మాత్రమే ప్రస్తావించడంతో ఈ చర్చ జరుగుతోంది.

Exit mobile version