Site icon NTV Telugu

Nagarjuna: కింగ్ నాగ్ హ్యాట్రిక్ కొట్టేసాడు…

King Nagarjuna

King Nagarjuna

కింగ్ నాగార్జున, ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ తో కలిసి “నా సామీ రంగ” సినిమా చేసాడు. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకోని ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. సంక్రాంతి బరిలో ఇతర సినిమా ఉన్నా కూడా నాగార్జున నా సామిరంగ సినిమాని రిలీజ్ రేస్ లో నిలబెట్టాడు. ఇప్పుడే కాదు గతంలో కూడా నాగార్జున ఎన్ని పెద్ద సినిమాలు ఉన్నా కూడా తన సినిమాని సంక్రాంతి బరిలో నిలబెట్టడానికి అసలు వెనుకాడలేదు. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాలు సంక్రాంతికి భారీ పోటీ మధ్య రిలీజ్ అయ్యి హిట్స్ గా నిలిచినవే. మౌత్ టాక్ ని మాత్రమే నమ్మే నాగార్జున… సోగ్గాడే చిన్ని నయన సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన బంగార్రాజు మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది.

టికెట్ రేట్స్, థియేటర్స్ లాంటి ఇష్యూని అసలు పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ రిలీజ్ చేసుకుంటూ వెళ్లిపోయే నాగార్జున ఇప్పుడు ‘నా సామీ రంగ’ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేసాడనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అన్ని సెంటర్స్ లో మార్నింగ్ షో పడిపోవడంతో నా సామిరంగ సినిమా చూసిన వాళ్లు నాగార్జున హిట్ కొట్టేసాడు, పర్ఫెక్ట్ ఫ్యామిలీ బొమ్మ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. జనరల్ ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ వస్తోంది కాబట్టి నా సామిరంగ సినిమా చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లిపోతున్నారు. దీంతో నా సామిరంగ సినిమా నాగార్జున లిస్టులో హ్యాట్రిక్ సంక్రాంతి హిట్ గా నిలిచింది, నాగ్ సంక్రాంతికి వస్తే హిట్ కొడతాడు అని నిరూపించింది. మరి పాజిటివ్ టాక్ తో ఫుల్ రన్ లో నా సామిరంగ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది? సోగ్గాడే చిన్ని నాయన రేంజ్ హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Exit mobile version