NTV Telugu Site icon

Nagababu: గుండెపోటుతో NRI మృతి.. తీవ్ర శోకానికి గురిచేసిందంటూ నాగబాబు ట్వీట్!

Nagababu

Nagababu

Nagababu Comments on NRI Janasena Follower Death: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకపక్క ఎన్నికల వేడి కొనసాగుతుంటే మరొక పక్క సూర్యుడి భగభగలు సెగలు రేపుతున్నాయి. భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో చాలా మంది అస్వస్థత బారిన పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే తాజాగా జనసేనకు చెందిన ఒక ఎన్నారై ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ వచ్చారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత నాగబాబు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పెడనకి చెందిన కరుడుగట్టిన కమిటడ్ NRI జనసైనికుడు కటకం విజయ్ కుమార్ జనసేన తరపున ప్రచారం చేస్తుండగా గుండెపోటుతో మరణించడం తీవ్ర శోకానికి గురిచేసింది.

Jr NTR: టీడీపీ ర్యాలీలో ఎన్టీఆర్ కి పాలాభిషేకం

జనసేన మీద అమితమైన ప్రేమతో ‘అమెరికా’ నుంచి వచ్చి బాలశౌరి, కొల్లు రవీంద్ర, బండి రామకృష్ణతో NDA కూటమి తరపున పిఠాపురం, మచిలీపట్నం, తిరుపతి & పెడన లో ప్రచారం చేశారు, ఆయన ‘జనసేన’ గెలుపు కోసం పని చేశారు కానీ కనీసం జనసేనానిని కలవాలని కూడా అనుకోలేదు. ఇలాంటి Dedicated జనసైనికున్ని కోల్పోవడం కలిచివేస్తుంది, త్వరలోనే అధినేత పవన్ కళ్యాణ్ తో నేను కూడా వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తాం, ఇలాంటి వ్యక్తులని కోల్పోవడం వారి కుటుంబానికే కాదు జనసేన పార్టీకి కూడ తీరని లోటు,వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని నాగబాబు పేర్కొన్నారు. ఇక ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచార హోరు పెద్ద ఎత్తున కొనసాగుతోంది. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో దాదాపు అన్ని పార్టీల అభ్యర్థులు తమ బలపరిచే వారితో కలిసి ప్రచారాలు చేస్తున్నారు.

Show comments