NTV Telugu Site icon

Naga Vamsi: అన్నకు సమంత! తమ్ముడికి వర్ష బొల్లమ్మ!! ఎందుకంటే…

Naga Vamsi On Swathi Muthya

Naga Vamsi On Swathi Muthya

Naga Vamsi Shares Interesting Facts About Swathi Muthyam Movie: ఈ ఏడాది ప్రారంభంలోనే ‘డీజే టిల్లు’, ‘భీమ్లా నాయక్’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తోన్న తాజా చిత్రం ‘స్వాతిముత్యం’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ వినోదభరిత కుటుంబకథా చిత్రంలో గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించారు. లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నాగవంశీ విలేకర్లతో చిత్ర విశేషాలను పంచుకున్నారు.

‘స్వాతిముత్యం’తో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు గణేశ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆ విషయమై మాట్లాడుతూ, ”బెల్లంకొండ సురేష్ గారు తన పెద్దబ్బాయిని సమంతను హీరోయిన్ గా పెట్టి గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇది అలా కాదు. ఈ సినిమా మంచి కాన్పెప్ట్ తో తెరకెక్కింది. గణేశ్‌ కు నటుడిగా మంచి పేరు తెచ్చిపెడుతుంది. కథానుగుణంగానే మేం వర్ష బొల్లమ్మను తీసుకున్నాం. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’లో ఆమె నటన చూసి ఎంపిక చేశాం. దీనిలో కూడా ఒక స్మాల్ టౌన్ అమ్మాయి క్యారెక్టర్ ను వర్ష పోషించింది. ఆ పాత్రకి ఆమె సరిగ్గా సూట్ అయ్యింది. వీరిద్దరికీ మంచి పేరు వస్తుంది” అని అన్నారు.

కథ గురించి చెబుతూ, ”ఇది ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. థియేటర్ నుంచి నిస్సందేహంగా నవ్వుకుంటూ బయటకు వస్తారు. అద్భుతం తీశాం, అవార్డులు వచ్చే సినిమా అని చెప్పను. పండగ రోజు థియేటర్ కి వస్తే మాత్రం గ్యారంటీగా నవ్వుకునే బయటకు వస్తారు. ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని పాయింట్ తో చేశాం. ఒక కాంట్రవర్షియల్ టాపిక్ ని ఫన్ టోన్ లో చెప్పాం” అని అన్నారు. ‘గాడ్ ఫాదర్, ది ఘోస్ట్’ చిత్రాలతో పోటీ పడటం గురించి చెబుతూ, ”కోవిడ్ తర్వాత ప్రతివారం కనీసం రెండు మూడు సినిమాలు వస్తున్నాయి. పైగా దసరా సీజన్ కాబట్టి రెండు సినిమాలున్నా రిస్క్ తీసుకుంటున్నాం. ఇది కాన్ఫిడెన్సో, ఓవర్ కాన్ఫిడెన్సో కాదు” అని చెప్పారు. టైటిల్ గురించి వివరిస్తూ, ”హీరో క్యారెక్టర్ అమాయకంగా ఉంటుంది. అందుకే ‘స్వాతిముత్యం’ టైటిల్ సరిగ్గా సరిపోతుందని పెట్టాం. పైగా చిన్న సినిమాకి క్లాసిక్ ఫిల్మ్ టైటిల్ పెడితే ప్రేక్షకులలోకి త్వరగా వెళ్తుందన్నది మా నమ్మకం. సినిమా చూశాక ఇది యాప్ట్ టైటిల్ అని అందరికీ అనిపిస్తుంది. ఇందులో హీరో పిచ్చోడు కాదు అమాయకుడు. బట్…. ఈ జనరేషన్ లో ఉండాల్సిన వాడు కాదు. చాలా మంచోడు. శేఖర్ కమ్ముల గారి సినిమాల్లో హీరోలా ఉంటాడు” అని అన్నారు. సినిమా విజయం పట్ల తనకున్న నమ్మకం గురించి తెలియచేస్తూ, ”’బింబిసార, సీతారామం, కార్తికేయ -2′ వేటికవే విభిన్నమైన చిత్రాలు. అవన్నీ ఆదరణ పొందాయి. అలానే ఇటీవల ఎంటర్టైన్మెంట్ సినిమాలు పెద్దగా రాలేదు. మా ‘డీజే టిల్లు’ తర్వాత ఇదే అనుకుంటున్నాను. అలా అని కేవలం ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా కొత్త కాన్సెప్ట్ ను తీసుకున్నాం. సో… ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది” అని చెప్పారు.

తమ బ్యానర్ నుండి వస్తున్న సినిమాల గురించి చెబుతూ, ”మేం అన్ని రకాలు చిత్రాలు చేస్తున్నాం. ‘డీజే టిల్లు, వరుడు కావలెను, స్వాతిముత్యం’ ఇలా చిన్న చిత్రాలతో ప్రయోగాలు చేశాం. అలాగే నెక్స్ట్ బాలకృష్ణ గారు, రవితేజ గారు, వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టి వంటి హీరోలతో పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తున్నాం. కాలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీతో తారక్ గారి బావమరిదిని లాంచ్ చేస్తున్నాం. చిరంజీవి గారితోనూ సినిమా చేయాలని ఉంది. త్వరలోనే మా కోరిక నెరవేరుతుందని అనుకుంటున్నాను” అని చెప్పారు. త్రివిక్రమ్, మహేష్ కాంబో మూవీ గురించి మాట్లాడుతూ, ”వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘అతడు, ఖలేజా’లకు థియేటర్స్ లో రావాల్సినంత ఆదరణ రాలేదు. కానీ టీవీల్లో మాత్రం జనం పిచ్చి పిచ్చిగా చూసి, ఆ కాంబినేషన్ అంచనాలు విపరీతంగా పెంచేశారు. ఏ స్థాయిలో అంచనాలు పెట్టుకొని థియేటర్ కి వచ్చినా అంతకుమించి మెప్పించేలా మా సినిమా ఉంటుంది” అని అన్నారు.

Show comments