Site icon NTV Telugu

నాగశౌర్య ఫామ్ హౌజ్ లో జూదం… రిమాండ్ కు తరలింపు

Naga-Shaurya

Naga-Shaurya

యంగ్ హీరో నాగశౌర్య ఫామ్ హౌజ్ ప్రముఖుల పేకాటకు అడ్డాగా మారింది. తాజాగా పక్కా సమాచారంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులకు పలువురు అడ్డంగా దొరికిపోయారు. నగరానికి చెందిన 20 మంది ప్రముఖుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం కేసులో విచారణ కొనసాగుతోంది. జూదం నిర్వహిస్తున్న గుత్తా సుమన్ కుమార్ తో పాటు మరి కొందరిని పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే గుత్తా సుమన్ కుమార్ ఫోన్ ని సీజ్ చేసిన పోలీసులు సుమన్ కు నాగ శౌర్యకు మద్య సంబంధాలపై విచారణ జరుపుతున్నారు. తెరపైకి నాగ శౌర్య బాబాయ్ బుజ్జి పేరు రావడంతో ఆయనపై పలు అనుమానాలు వ్యక్తంగా అవుతున్నాయి. దీంతో పోలీసులు మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు అధికారులు. మరికాసేపట్లో వారిని రిమాండ్ కు తరలించనున్నారు.

Read also : దీపావళికి ట్రీట్ ఇవ్వబోతున్న ‘పుష్ప’రాజ్

Exit mobile version