Site icon NTV Telugu

డబ్బింగ్ కార్యక్రమాల్లో నాగశౌర్య – అనీష్‌ కృష్ణ మూవీ!

హ్యాండ్‌ సమ్ హీరో నాగశౌర్య సొంత బ్యానర్ లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘అశ్వద్థామ’ గత యేడాది జనవరి 31న విడుదలైంది. ఇక ఈ సంవత్సరం కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం నాగశౌర్య నటించిన ‘వరుడు కావలెను, లక్ష్య’ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్‌ రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం నాగ శౌర్య ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ తో పాటు సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లోనూ ఓ మూవీ చేస్తున్నాడు. షీర్లే సేతియా హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాను అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. సీనియర్‌ హీరోయిన్‌ రాధిక ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీకి ఇంకా పేరు ఖరారు చేయలేదు. అయితే ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డబ్బింగ్‌ కార్యక్రమాలను డిసెంబర్‌ 14వ తేదీ మొదలు పెట్టారు. ఈ సర్‌ప్రైజింగ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ‘వెన్నెల’ కిశోర్, రాహుల్‌ రామకృష్ణ, సత్య కామెడీ హీలేరియస్‌గా ఉండ‌బోతోందని తెలుస్తోంది. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్‌ ఛాయాగ్రాహకులు.

Exit mobile version