ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వచ్చిన నాగశౌర్య కొంత కాలంగా సైలెంట్ అయ్యాడు. చివరిగా 2023 లో రంగబలి అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఆ సినిమా కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దాంతో సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చేసాడు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా నాగ శౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అనే యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులని అలరించటానికి వస్తున్నాడు. నూతన దర్శకుడు రామ్ దేశిన దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించాడు శౌర్య.
ఎప్పటినుండో సెట్స్ పై ఉన్న ఈ సినిమా టీజర్ ను ఈ రోజు రిలీజ్ చేసారు మేకర్స్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటెర్టైనర్ గా బ్యాడ్ బాయ్ కార్తీక్ టీజర్ ను రిలీజ్ చేసారు. భారీ ఫైట్స్, రొటీన్ డైలాగ్స్ తో నింపేసారు. ఇక చివర్లో వెన్నెల కిషోర్ తో ఎదో కామెడీ అని ట్రై చేసారు. ఓవరాల్ గా చూస్తే బ్యాడ్ బాయ్ కార్తీక్ ఒక రొటీన్ కమర్షియల్ టీజర్ లానే అనిపిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు సముద్రకని, సీనియర్ నరేష్, సాయికుమార్, మరియు శ్రీదేవి విజయ్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా తమిల్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. నాగ శౌర్య కు జోడిగా వీధి హీరోయిన్ గా నటిస్తుండగా వైష్ణవి ఫిలింస్ పతాకంపై శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు.
