NTV Telugu Site icon

Dear Trailer: ఫస్ట్ నైట్ రోజే గురకపెట్టిన ఐశ్వర్య.. పాపం ప్రకాష్!

Dear Official Trailer

Dear Official Trailer

Naga Chaitanya’s Voiceover For Trailer Prakash Kumar Dear: జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా ‘డియర్’ తమిళ్ లో ఏప్రిల్ 11న, తెలుగులో ఏప్రిల్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా నట్మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు. నాగ చైతన్య వాయిస్ ఓవర్ అందించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రయిలర్ పరిశీలిస్తే నూతన వధూవరుల పాత్రల్లో జివి ప్రకాష్ కుమార్ , ఐశ్వర్య రాజేష్ లైఫ్ లో స్నీక్ పీక్ ను చూపించారు. భార్య గురక అలవాటు కారణంగా రిలేషన్ షిప్ కాంప్లికేటెడ్ గా మారిన కథాంశం యూనిక్ గా అనిపిస్తుంది.

Ravi Babu Family: విలన్ రవిబాబుకి హీరోయిన్ లాంటి కూతురు.. ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా?

పెళ్ళైన మొదటి నైట్ నుంచే ఆమె గురక దెబ్బకు బిత్తర పోతాడు భర్త. నాగ చైతన్య వాయిస్ ఓవర్ ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఇక జగదీష్ సుందరమూర్తి కెమెరా బ్రిలియంట్ గా వుంది. జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కామిక్ కోణాన్ని ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రా ప్రాంతంలో విడుదల చేయనుండగా, ఏషియన్ సినిమాస్ తెలంగాణ ప్రాంతంలో విడుదల చేయనుంది. డియర్‌లో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని కీలక పాత్రలలో నటించారు. అయితే ఇదే గురక కాన్సెప్ట్ తో తెరెక్కిన గుడ్ నైట్ సినిమా తమిళంలో బాగా వర్కౌట్ అయింది. తెలుగులో ఓటీటీలో వచ్చాక ఇక్కడ కూడా ఆదరించారు. మరి ఈ సినిమాను ఏమి చేస్తారో చూడాలి.