నాగ చైతన్య హీరోగా సమంత హీరోయిన్ గా వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో ‘మజిలీ’ కి ప్రత్యేక స్థానం ఉంది. యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఆన్ స్క్రీన్ నాగ చైతన్య-సమంత భార్య భర్తలుగా కలిసి నటించిన చివరి సినిమా కూడా.
Also Read : Hero Sriram : డ్రగ్స్ కేసులో నటుడు ‘శ్రీరామ్’ కు రిమాండ్
అయితే ఇప్పుడు మరోసారి మజిలీ దర్శకుడితో నాగ చైతన్య సినిమా రాబోతుంది. దర్శకుడు శివ నిర్వాణ ఇటీవల నాగ చైతన్యను కలిసి ఓ కథ చెప్పాడం జరిగింది. పాయింట్ బాగా నచ్చడంతో శివకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసాడు చై. దర్శకుడు శివ నిర్వాణ ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. త్వరలో ఈ సినిమాకు సంబందించి అధికారిక ప్రకటన రాబోతుంది. నాగ చైత్యన్య కెరీర్ లో మైల్ స్టోన్ 25వ సినిమాగా రాబోయే ఈ సినిమా ఫీల్-గుడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్నట్టు సమాచారం. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ ఏడాది చివరి నాటికి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. టక్ జగదీష్, ఖుషి వంటి బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ ఇచ్చిన శివ నిర్వాణ నాగ చైతన్యతో సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాడు. అటు చైతన్య కూడా విరూపాక్ష దర్శకుడితో చేస్తున్న సినిమా ఫినిష్ చేసి శివ నిర్వాణసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు.
