Thandel Leaked Video Viral in Social Media: నాగచైతన్య హీరోగా తండేల్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమా మీద గీతా ఆర్ట్స్ 2 చాలా అంచనాలు పెట్టుకుంది. అయితే సాధారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన కొంతమంది మత్స్యకారులు గుజరాత్ లోని పలు తీర ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడి వారి బోట్లలో వేటకు వెళ్లి జీవనం సాగిస్తూ ఉంటారు. అలా ఇక్కడి నుంచి గుజరాత్ బోట్ల మీద పనికి వెళ్లిన రాజు అనే ఒక వ్యక్తి తన బృందం మొత్తంతో కలిసి అంతర్జాతీయ జలాలు దాటిన తర్వాత పాకిస్తాన్ నావికాదళం సిబ్బందికి దొరకడంతో అరెస్ట్ అయ్యాడు. అలా పాకిస్తాన్ జైలుకు వెళ్లిన రాజు మళ్లీ తిరిగి ఎలా ఇండియా వచ్చాడు? అనే ఆసక్తికరమైన నిజంగా జరిగిన విషయాన్ని సినిమాగా మలుస్తున్నారు.
Johnny Master: జనసేనలో చేరిన స్టార్ కొరియోగ్రాఫర్
రియల్ స్టోరీ కావడంతో పాటుగా సదరు రాజు అనే వ్యక్తి కథను దగ్గర నుండి చూసిన ఒక వ్యక్తి ఇచ్చిన కథ కావడంతో ఈ సినిమా మీద సాధారణంగానే అంచనాలు ఏర్పడుతున్నాయి. దానికి తోడు సినిమా యూనిట్ రిలీజ్ చేసిన ఒక వీడియో కూడా ఆసక్తికరంగా ఉండటమే కాదు నాగచైతన్యలో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరింప చేసింది. దీంతో ఈ సినిమా మీద అందరిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగచైతన్య సాయి పల్లవి చేతిని పట్టుకుని పరుగులు పెడుతున్నట్టుగా ఆ వీడియో ఉంది. ఈ వీడియోని సినిమా యూనిట్ రిలీజ్ చేయలేదు కానీ ఎవరో షూటింగ్ చూస్తున్నవారు రికార్డు చేసి లీక్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఇక ఈ లీకెడ్ వీడియో చూస్తుంటే సినిమాని చాలా నాచురల్ గా చేస్తున్నారేమో అనిపిస్తుంది. కాబట్టి నాగచైతన్య కెరియర్ లో ఇది ఒక మెమొరబుల్ సినిమా అయ్యే అవకాశాలు ఉన్నాయని తప్పదు.