Site icon NTV Telugu

Naga Chaitanya : మెసేజ్‌లతో పుట్టిన ప్రేమ.. నాగ చైతన్య రివీల్ చేసిన సీక్రెట్

Shah Rukh Khan Injury

Shah Rukh Khan Injury

అక్కినేని యంగ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య, ‘తండేల్’ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఇక వ్యాక్తిగత విషయానికి వస్తే నటి శోభిత ని పెళ్లి చేసుకుని, తమ వైవాహిక జీవితంలో హ్యాపీ గా ఉన్నాడు చై. డిసెంబర్ ఆయన తాత, సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వర రావు స్థాపించిన కుటుంబ వారసత్వ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ జరిగింది. దీంతో మొత్తానికి చైతన్య ఒక ఇంటివాడయ్యాడు. కానీ చాలా మందిలో.. అసలు వీరి ఎలా కలిశారు ఇదంతా ఎలా జరిగింది అని వాళ్ళ లవ్ స్టోరీ గురించి చాలా సందేహాలు ఉన్నాయి. మొత్తానికి ఈ విషయంపై నోరు విప్పాడు చై.

Also Read : Deepika Padukone: దీపిక త్యాగాన్ని గుర్తించి.. సపోర్ట్‌గా నిలిచిన త్రిప్తి

తాజాగా జగపతి బాబు నిర్వహించిన టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ లో పాల్గొన్న నాగ చైతన్య తన ప్రేమకథ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. “నేను ఇన్‌స్టాగ్రామ్ ఒక పోస్ట్‌ పెట్టినప్పుడు శోభిత స్పందించింది. ఆ చిన్న చాట్ నుంచి మాకు మెసేజ్‌లు మారుతూ, ప్రేమకథ పుట్టింది. అలా కొద్ది రోజులకే మేమిద్దరం కలిశాం ” అని తెలిపారు. అంటే, సోషల్ మీడియా పోస్ట్‌ ద్వారా వారి పరిచయం మొదలై, ప్రేమ మారీ వివాహం వరకు వచ్చింది అని ఆయన రివీల్ చేశారు. ప్రజంట్ సోషల్ మీడియాలో ఈ లవ్ స్టోరీ వైరల్ అయింది. ప్రస్తుతం నాగ చైతన్య, దర్శకుడు కార్తీక్ వర్మతో విరూపాక్ష అనే సాలిడ్ థ్రిల్లర్‌పై పని చేస్తున్నాడు.

 

Exit mobile version