Site icon NTV Telugu

Naga Chaitanya: #NC23 ‘తండేల్’గా మారిపోయింది… ఇకపై చై లవర్ బాయ్ కాదు యాక్షన్ హీరో

Naga Chaitanya

Naga Chaitanya

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య లవర్ ఇమేజ్ నుంచి పక్కకి వచ్చి పూర్తిస్థాయి కమర్షియల్ హీరోగా ఛేంజోవర్ చూపించడానికి రెడీ అయ్యాడు. ఇప్పటివరకూ ఎక్కువ శాతం కూల్ లవ్ స్టోరీస్ చేసిన చైతన్య, ఇప్పుడు కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటితో కలిసి సినిమా చేస్తున్నాడు. నాగ చైతన్య కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో గీత ఆర్ట్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది. #NC23గా అనౌన్స్ అయ్యి… ప్రీప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతోంది. నాగ చైతన్య పక్కన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి లవ్ స్టోరీ సినిమాతో మంచి హిట్ కొట్టారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కోసం చై-సాయి పల్లవి మరోసారి కలిశారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

నాగచైతన్య బర్త్ డే గిఫ్ట్ గా ఒక ముందే #NC 23 ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. అక్కినేని ఫ్యాన్స్ ని థ్రిల్ చేస్తూ NC23 టైటిల్ ‘తండేల్’ అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. ఈ పోస్టర్ లో నాగ చైతన్య తెడ్డు పట్టుకోని, కర్లీ హెయిర్ తో, ఫుల్ గడ్డంతో మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. రిప్డ్ ఫిజిక్ ని చూపిస్తూ నాగ చైతన్య కనిపించిన విధానం కేవలం అక్కినేని అభిమానులకే కాదు సినీ అభిమానులందరినీ మెప్పించేలా ఉంది. రియల్ ఇన్సిడెంట్ నేపథ్యంలో తండేల్ సినిమా తెరకెక్కుతుంది. మరి జాలరిగా కనిపించనున్న చైతన్య ఏ రేంజ్ హిట్ కొడతాడు అనేది చూడాలి. ఇప్పటికైతే తండేల్ పోస్టర్ తో ఇప్పటివరకూ కనిపించని నాగ చైతన్యని చూసాం.

Exit mobile version