Site icon NTV Telugu

Naga Chaitanya: సమంతతో విడాకులపై ఓపెన్.. అదే నా సమాధానం

Naga Chaitanya Divorce

Naga Chaitanya Divorce

Naga Chaitanya Finally Reacts On Divorces With Samantha: సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత.. నాగ చైతన్య ఏనాడూ పబ్లిక్‌గా ఆ విషయంపై మాట్లాడలేదు. అందుకు సంబంధించి తనకు ప్రశ్నలు ఎదురైనప్పుడల్లా.. వాటిని మెచ్యూర్‌గా దాటవేస్తూ వచ్చాడు. కానీ, సమంత మాత్రం కొన్ని సందర్భాల్లో ఘాటుగానే రియాక్ట్ అయ్యింది. విడాకుల సమయంలో తానెంతో కుంగిపోయానని, తనపై లేనిపోని అభాండాలు మోపారంటూ.. రీసెంట్‌గా వచ్చిన ‘కాఫీ విత్ కరణ్ షో’లో కూడా పెదవి విప్పింది. చైతూ మాత్రం ఎప్పుడూ అలా ఓపెన్ అవ్వలేదు. కానీ, తొలిసారి ఓపెన్ అయ్యాడు.

లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్‌లో భాగంగా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోన్న అతనికి, తరచూ డివోర్స్ గురించి ప్రశ్నలు ఎదురవుతున్న తరుణంలో ఎట్టకేలకు స్పందించాడు. ‘‘సమంతతో విడాకులపై నేను అప్పుడే ప్రకటన చేశాను. అదే నా సమాధానం. విడాకులకు గల కారణాలేంటో ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్రస్తుతం ఎవరి వ్యక్తిగత జీవితాన్ని వారు జీవిస్తున్నాం. సమంత తన దారి తాను చూసుకుంటోంది, నేను నా కెరీర్‌పై ఫోకస్ పెట్టాను’’ అని చైతూ సమాధానం ఇచ్చాడు. తన వ్యక్తిగత జీవితం ఒక టాపిక్ అవ్వాలని అనుకోవడం లేదని, అది తనని ఫ్రస్ట్రేషన్‌కి గురి చేస్తుందన్నాడు. అందరికీ తమకంటూ వ్యక్తిగత జీవితాలుంటాయని, అందుకే దాన్ని ‘పర్సనల్’ అని పిలుస్తామని కాస్త ఘాటుగానే సమాధానమిచ్చాడు. ఈ విషయంలో మొదట్లో తన మీద వచ్చిన రూమర్స్ గురించి ఎక్కువ ఆలోచించేవాడినని, కానీ ఇప్పుడు వాటిని ఏమాత్రం పట్టించుకోనన్నాడు.

అలాగే సమంతతో మళ్లీ వెండితెరపై జోడీ కట్టే విషయంపై ప్రశ్న ఎదురైతే, మొదట్లో గట్టిగా నవ్వేశాడు. అనంతరం మాట్లాడుతూ.. అదే గనుక జరిగితే, కచ్ఛితంగా నిజంగా క్రేజీగా ఉంటుందన్నాడు. అయితే, అది సాధ్యమవుతుందా లేదా అన్నది తనకు తెలియదన్నాడు. మా జోడీ కుదురుతుందా? లేదా? అన్నది కాలమే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందంటూ.. తెలివిగా ఆ ప్రశ్నకు జవాబిచ్చాడు చైతూ.

Exit mobile version