Naga Chaitanya: విజయం వైపు.. నాగచైతన్య చూపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Chaitanya: అక్కినేని నటవంశం మూడోతరం హీరోగా జనం ముందు నిలచిన నాగచైతన్య అభిమానుల మదిని దోచుకున్నారు. తన ప్రతి చిత్రంలోనూ వైవిధ్యం ప్రదర్శించడానికే ఆయన తపిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీకి అచ్చివచ్చిన రొమాంటిక్ స్టోరీస్ తోనే నాగచైతన్య ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. తొలి చిత్రం ‘జోష్’ మొదలు మొన్న వచ్చిన ‘థ్యాంక్ యూ’ దాకా నాగచైతన్య కెరీర్ గ్రాఫ్ లో ప్రేమకథలే ప్రధాన పాత్ర పోషించాయి. లవర్ బోయ్ ఇమేజ్ తోనే సాగుతున్న నాగచైతన్య అప్పుడప్పుడూ భిన్నంగానూ ప్రయత్నించారు.
నాగచైతన్య 1986 నవంబర్ 23న హైదరాబాద్ లో జన్మించారు. తండ్రి వైపు మహానటవృక్షం అక్కినేని నాగేశ్వరరావుకు మనవడు, తల్లివైపున స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడుకూ మనవడే! ఇలా రెండు ప్రముఖ కుటుంబాలకు చెందిన నాగచైతన్యకు తాత ఏయన్నార్, తండ్రి నాగార్జున, మేనమామ వెంకటేశ్ లాగే నటుడవ్వాలనే అభిలాష బాల్యం నుంచీ ఉండేది. పైగా ఎటు చూసినా సినిమా వాతావరణం అలవాటవ్వడం వల్ల ఎప్పుడెప్పుడు తెరపై హీరోగా కనిపించాలన్న ఆసక్తి ఉండేది. అదే విషయాన్ని తన తొలి చిత్రం ‘జోష్’ ఆడియో వేడుకలో ఎంతో ఉత్సాహంగా చెప్పారు నాగచైతన్య. ఆ సినిమా అంత జోష్ నింపక పోయినా, రెండవ చిత్రం ‘ఏ మాయ చేశావె’ అతను కోరుకున్న విజయాన్ని అందించింది. చైతూ కెరీర్ నే కాదు, లైఫ్ నూ మలుపు తిప్పిన చిత్రంగా ‘ఏ మాయ చేశావె’ నిలచిపోయింది. అక్కినేని అభిమానులకు ఆ చిత్రం ఎనలేని ఆనందమూ పంచింది. వెంటనే సుకుమార్ దర్శకత్వంలో నటించిన ‘100 పర్సెంట్ లవ్’ కూడా నాగచైతన్యకు మరపురాని అనుభూతిని మిగిల్చింది. ఈ సినిమాల తరువాత వచ్చిన చిత్రాలు అంతగా అలరించలేదు. కానీ, తన నటజీవితంలో మరపురాని చిత్రంగా నాగచైతన్య పేర్కొన్న ‘మనం’లో తాత, తండ్రి, తమ్ముడు అఖిల్ తో కలసి చైతూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సినిమా ఘనవిజయం సాధించింది.
Also Read
- Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
- The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
- Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
- Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
నాగచైతన్య కెరీర్ లో “ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, మహానటి, శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి, మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ” వంటి చిత్రాలు అతణ్ణి వైవిధ్యమైన పాత్రల్లో చూపించాయి. ఇప్పటికే దాదాపు ఇరవై చిత్రాలలో నటించేసిన నాగచైతన్య, ఈ నాటికీ వరైటీ రోల్స్ కే ప్రాధాన్యమిస్తూ సాగుతున్నారు. ఈ యేడాది చైతూ నటించిన మూడు చిత్రాలు జనం ముందు నిలిచాయి. తండ్రి నాగార్జునతో కలసి ‘బంగార్రాజు’లో నటించారు. ఆమిర్ ఖాన్ హీరోగా హిందీలో తెరకెక్కిన ‘లాల్ సింగ్ ఛద్దా’లోనూ నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషించారు. అలాగే ‘మనం’ చిత్ర దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్ యూ’లోనూ చైతూ అభినయించారు. ఈ మూడు చిత్రాలు మునుపటిలా చైతూకు విజయాలను అందించలేక పోయాయి. ప్రస్తుతం ఓ సరైన సక్సెస్ కోసం నాగచైతన్య ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు నాగచైతన్య ఆశలన్నీ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటిస్తున్న సినిమాపైనే ఉన్నాయి. మరి ఈ సినిమాతో చైతూ ఎలాంటి సక్సెస్ చేజిక్కించుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
-
Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
-
RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
-
YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!