ఆయుధాలు లేని యుద్ధం… ‘రా చూద్దాం’ అంటూ యంగ్ హీరో నాగ చైతన్య తెలుగు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని పెంచేస్తున్నారు. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడల్లో కబడ్డీ ఒకటి. ఇటీవల కాలంలో ప్రొ కబడ్డీ లీగ్‌కి క్రేజీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తాజాగా ప్రో కబడ్డీ సందడి మొదలైపోయింది. ఆసక్తిని రేకెత్తించే మ్యాచ్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 8కి రెడీ అవుతోంది. డిసెంబర్ 22న బెంగళూరులో కొత్త సీజన్ ప్రారంభం అవుతుంది. ఐపీఎల్ లాగానే ప్రొ కబడ్డీ జట్లకు కూడా బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారు. తెలుగు టైటాన్స్ జట్టులో అద్భుతమైన డిఫెండర్లు, రైడర్లు… బాహుబలి, సిద్ధార్థ్ దేశాయ్, రోహిత్ కుమార్, విశాల్ భరద్వాజ్ వంటి బలమైన ఆటగాళ్లు ఉన్నారు. తెలుగు టైటాన్స్ కు ఈసారి అక్కినేని హీరో నాగ చైతన్య బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
Read Also : బిగ్‌బాస్-5లో టాప్-5 కంటెస్టెంట్లు వీళ్లే.. టైటిల్ విజేత అతడేనా?
తాజాగా దీనికి ప్రో కబడ్డీకి సంబంధించి ‘లే పంగా’ అంటూ నాగ చైతన్య చేసిన వీడియోను రానా దగ్గుబాటి విడుదల చేశాడు. అందులో “జెర్సీ మాత్రమే కాదు కవచమది… గ్రౌండ్ మాత్రమే కాదు పోరాట స్థలమది… ఆయుధాలు లేకుండా జరిగే ఈ అత్యుత్తమ యుద్ధంలో తెలుగు టైటాన్స్ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. రా.. చూద్దాం! డిసెంబర్ 22 నుంచి ప్రో కబడ్డీ… ” అంటూ అందులో ఉంది.
