Site icon NTV Telugu

Naga Babu: అన్నయ్య బర్త్ డే రోజు.. ఆయనకే తెలియని విషయం చెప్తా..!!

Nagababu

Nagababu

Naga Babu: ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని మెగా బ్రదర్ నాగబాబు వెల్లడించారు. ఈనెల 22న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా మెగా గ్రాండ్ కార్నివల్‌ను నిర్వహిస్తున్నట్లు నాగబాబు స్పష్టం చేశారు. 20 ఏళ్లకు పైగా మెగా అభిమానులు చూపించే ఆదరాభిమానాలను దృష్టిలో ఉంచుకుని వాళ్లకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేసినట్లు నాగబాబు తెలిపారు. తెలుగులో చెప్పాలంటే ఇదొక జాతర మాదిరిగా ఉంటుందన్నారు. గోవా కార్నివల్, బ్రెజిల్ కార్నివల్ రేంజ్‌లో కాకపోయినా తెలుగు సినీ పరిశ్రమలో తొలిసారిగా అభిమానుల కోసం కార్నివల్ ఏర్పాటు చేస్తున్నామని.. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క మెగా అభిమాని తరలిరావాలని ఆహ్వానం పలికారు.

Read Also: Puri Jagannath: ఛార్మితో ఎఫైర్.. ఎట్టకేలకు నిజం చెప్పిన పూరి

ఈ వేడుకల్లో పాల్గొనాలని భావించే అభిమానులకు పాసులు జారీ చేస్తామని.. ఈ పాసులను ఈనెల 19 నుంచి బ్లడ్ బ్యాంక్, అభిమాన సంఘాల వద్ద తీసుకోవచ్చని నాగబాబు సూచించారు. ఈ ఏడాది చిరంజీవి బర్త్ డే వేడుకలు డిఫరెంట్‌గా ఉండాలనే ఉద్దేశంతోనే మెగా గ్రాండ్ కార్నివల్ నిర్వహిస్తున్నామని.. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరూ హాఉరవుతారని నాగబాబు తెలిపారు. ఈ ఈవెంట్‌కు తరలివచ్చే అభిమానుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్లాన్ చేశామని.. ఫుడ్ స్టాళ్లు కూడా ఉంటాయన్నారు. ఈవెంట్‌ రోజు తాను మూడు, నాలుగు నిమిషాలు మాట్లాడతానని.. ఈ సందర్భంగా ఎవరికీ తెలియని ఓ విషయాన్ని చెప్తానని.. బహుశా ఈ విషయం అన్నయ్యకు కూడా తెలియదని.. థర్డ్ సోర్స్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నానని.. అన్నయ్య బర్త్ డే రోజు ఈ విషయాన్ని చెప్తానని నాగబాబు వెల్లడించారు.

Exit mobile version