Site icon NTV Telugu

Nag Ashwin : కల్కి-2 ప్రారంభం అయ్యేది అప్పుడే.. నాగ్ అశ్విన్ క్లారిటీ

Nag Ashwin

Nag Ashwin

Nag Ashwin : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన కల్కి ఏడీ 2898 మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. దానికి సీక్వెల్ గా రెండో పార్టు ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. కానీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా నాగ్ అశ్విన్ స్పెషల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఆయనకు కల్కి రెండో పార్టు గురించే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా దీనిపై కొంత తడబాటుకు గురయ్యాడు. ఎందుకంటే అతని దగ్గర కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేదు.

Read Also : Shekhar Bhasha : విష్ణుప్రియ, టేస్టీతేజ తరఫున పోలీస్ స్టేషన్ కు శేఖర్ భాషా..

మొదటి పార్టు పెద్ద హిట్ కావడంతో చాలా సందేహాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. రెండో పార్టులో కర్ణుడిని ఎక్కువగా చూపిస్తారా లేదంటే అర్జునుడినా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అందుకే పాత్రల ప్రాధాన్యత పెంచేందుకు కీలక మార్పులు చేస్తున్నామని నాగ్ అశ్విన్ అన్నారు. ఏడాది చివర్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చూచాయంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ రెండింటినీ ఏడాది చివరినాటికి పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఆ తర్వాతనే కల్కి స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది.

Exit mobile version