NTV Telugu Site icon

Naatu Naatu: ఆస్కార్ తెచ్చిన పాటకి ఇండియన్ మైఖేల్ జాక్సన్ ట్రిబ్యూట్

Naatu Naatu

Naatu Naatu

ఒక ఇండియన్ సినిమా కలలో కూడా చేరుకోలేదు అనుకునే ప్రతి చోటుకి వెళ్లి జెండా ఎగరేసింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. రాజమౌళి తెరకెక్కించిన ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేసింది. వెస్ట్ ఈస్ట్ అనే తేడా లేకుండా ప్రపంచం మొత్తాన్ని ఊపేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా నుంచి ‘నాటు నాటు’ సాంగ్ ఇండియాకి ఆస్కార్ తెచ్చింది. ఒక ఇండియన్ సాంగ్ కి లేడీ గాగా, రిహన్నా లాంటి సింగర్స్ పోటీలో ఉండగా… వారిని వెనక్కి నెట్టి తెలుగు నాటు పాట ఆస్కార్ గెలవడం మన అందరం గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం. నాటు నాటు పాట ఆస్కార్ గెలవడం భారతీయ సినీ చరిత్రలో గోల్డెన్ మూమెంట్ గా చరిత్రకెక్కింది. ఈ పాట అంతగొప్పగా రావడానికి కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, చరణ్, ఎన్టీఆర్ లు కారణం.

Read Also: NTR: తీరం తాకనున్న ‘ఎన్టీఆర్ 30’ తుఫాన్

మన నాటు నాటు సాంగ్ ని ఎంతమంది ఎన్ని రకాలుగా అయినా పొగిడి ఉండొచ్చు, ఎంతో మంది ట్రిబ్యూట్ ఇచ్చి ఉండొచ్చు కానీ ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరున్న ప్రభుదేవా లాంటి డాన్స్ ‘నాటు నాటు’కి ట్రిబ్యూట్ ఇస్తూ హుక్ స్టెప్ ని వెయ్యడం అనేది నాటు నాటుకి దక్కిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అనే చెప్పాలి. ఒక స్టూడియోలో దాదాపు వంద మంది డాన్సర్స్ మధ్య ప్రభుదేవా ‘నాటు నాటు’ హుక్ స్టెప్ చేశాడు. తన స్టైల్ లో ప్రభుదేవా నాటు నాటుకి ట్రిబ్యూట్ ఇస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Show comments