Site icon NTV Telugu

అమెరికాలో ఊర”నాటు” రచ్చ… ఖండాలు దాటిన ‘ఆర్ఆర్ఆర్’ సాంగ్ క్రేజ్

rrr

rrr

తెలుగు సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ఇక విదేశాల్లో ఉన్న మన తెలుగు ప్రజలు సైతం మన పాన్ ఇండియా క్రేజ్ ను మరింతగా పెంచేస్తూ అదే లెవెల్ లో సందడి చేస్తున్నారు. ఇటీవల విడుదలైన బాలకృష్ణ “అఖండ” సినిమా విషయంలోనూ ఏకంగా డల్లాస్ లో కార్ ర్యాలీ, సినిమా థియేటర్లలో కొబ్బరి కాయలు కొట్టడం వంటి హడావిడి జరిగింది. ఇప్పుడు “ఆర్ఆర్ఆర్” విషయంలోనూ అలాంటిదే జరిగిందే. కానీ “ఆర్ఆర్ఆర్” ఇంకా విడుదల కాలేదుగా అనుకుంటున్నారా ? నిజమే… కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది “ఆర్ఆర్ఆర్” సాంగ్ విషయం. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఊర మాస్ సాంగ్ “నాటు నాటు” సంచలనం సృష్టిస్తోంది. సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసిన ఈ సాంగ్ క్రేజ్ ఇప్పుడు ఖండాలు దాటింది.

Read Also : నేను డిమాండ్ చేయను… కానీ… ట్రోలింగ్ పై సమంత రియాక్షన్

అమెరికాలోనూ “నాటు” సాంగ్ రీసౌండ్ విన్పిస్తోంది. డల్లాస్ లోని ఓ పబ్ లో “నాటు నాటు” సాంగ్ హిందీ వెర్షన్ ను పెట్టుకుని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు భారతీయులు. ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది. ఇక ఆ వీడియో ‘ఆర్ఆర్ఆర్’ టీం దృష్టిలో పడడంతో వారు కూడా ఈ వైరల్ వీడియోను పంచుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ 2022 జనవరి 7న విడుదల కానుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version